200 కుటుంబాలకు ఇబ్బంది.. శంకర్పల్లికి చౌక ధరల దుకాణం ఏర్పాటు చేయాలని డిమాండ్..!
మందమర్రి మండలం శంకర్పల్లి గ్రామంలో చౌక ధరల దుకాణం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.

200 కుటుంబాలకు ఇబ్బంది.. శంకర్పల్లికి చౌక ధరల దుకాణం ఏర్పాటు చేయాలని డిమాండ్..!
మందమర్రి, మనసాక్షి:
మందమర్రి మండలం శంకర్పల్లి గ్రామంలో
చౌక ధరల దుకాణం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
వివరాలు..
మందమర్రి రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో శంకర్పల్లి వార్డు సభ్యుడు దూట తిరుపతి మండల ప్రజాపరిషత్ అధికారి ఎన్. రాజేశ్వర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
గతంలో శంకర్పల్లి – సండ్రోన్ పల్లి గ్రామాలు
సారంగపల్లి గ్రామపంచాయతీతో ఉమ్మడిగా ఉండగా చౌక ధరల దుకాణం సారంగపల్లికే కేటాయించారని తెలిపారు. ప్రజల సమస్య
2018లో శంకర్పల్లిని ప్రత్యేక గ్రామపంచాయతీగా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు చౌక ధరల దుకాణం ఏర్పాటు కాలేదని పేర్కొన్నారు. గ్రామంలో సుమారు 200 రేషన్ కార్డులు ఉండగా
ప్రజలు రేషన్ కోసం 3 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని వాపోయారు.
డిమాండ్ :
గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని
శంకర్పల్లి గ్రామ పంచాయతీకి వెంటనే చౌక ధరల దుకాణం ఏర్పాటు చేసి న్యాయం చేయాలని
అధికారులను కోరారు.
MOST READ
-
Miryalaguda : మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల వేడి.. అధికార కాంగ్రెస్ లో వారంతా పోటీకి నై..!
-
Yadadri : యాదాద్రి జిల్లాలో నిండు గర్భిణీ పట్ల నిర్లక్ష్యం.. ఆసుపత్రిలో కనిపించని సిబ్బంది..!
-
Yadadri : యాదాద్రి జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు.. ఆరుగురి అరెస్ట్..!
-
District collector : జిల్లా కలెక్టర్ అనుదీప్ కు ప్రతిష్టాత్మక బిట్స్ పిలాని అవార్డు..!









