Ts Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..!
Ts Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..!
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీకి భారీ ఆదాయం
దసరా పండుగ నేపథ్యంలో రాయితీ కల్పించిన టిఎస్ఆర్టిసి
హైదరాబాద్, మన సాక్షి :
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ భారీ ఆఫర్ ప్రకటించింది. గత నెలలో రాఖీ సందర్భంగా ప్రకటించిన రాయితీతో ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది. ఆర్టీసీ చరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ లభించింది. ఈ నేపథ్యంలో దసరాకు కూడా భారీగా ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించే అవకాశం ఉన్నందున టికెట్లు బుక్ చేసుకున్న వారికి రాయితీ కల్పిస్తూ ఆఫర్లు ప్రకటించింది.
టికెట్ బుకింగ్ లో భారీ డిస్కౌంట్ కల్పించింది. అక్టోబర్ 15 నుంచి 29వ తేదీ వరకు ఆర్టీసీలో అప్ అండ్ డౌన్ రెండు ఒకేసారి టికెట్లు బుక్ చేసుకుంటే ప్రయాణంలో 10% రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టిసి తెలిపింది. ఈనెల సెప్టెంబర్ 30వ తేదీ లోపు టికెట్లు రిజర్వేషన్లు బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని పేర్కొన్నది.
దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ రాయితీ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఎండి వీసి సజ్జనర్ కోరారు. టికెట్లను ముందస్తుగా బుకింగ్ చేసుకోవడానికి ఆర్టీసీ అధికారిక వెబ్సైట్లో సందర్శించాలని ఆయన కోరారు . దసరాకు వీలైనన్ని ఎక్కువ బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తుందని, హైదరాబాదు నుంచి వివిధ జిల్లాలకు బస్సుల సంఖ్య పెంచాలని భావిస్తున్నట్లు కూడా తెలిపారు.
ALSO READ : Chandra Babu : చంద్రబాబు కేసులో ఏసీబీ కోర్టు సంచలన తీర్పు.. సిఐడి కస్టడీకి చంద్రబాబు..!
హైదరాబాదు నుంచి ఏపీకి ఎక్కువ బస్సులు పెంచే అవకాశం ఉన్నట్టు కూడా సజ్జనర్ పేర్కొన్నారు. గత నెలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీకి భారీ ఆదాయం లభించింది. ఆర్టీసీ రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రకటించిన ఆఫర్ ఆల్ టైం రికార్డ్ గా సృష్టించింది.
ఆగస్టు 31న 22.65 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది రాఖీ పౌర్ణమి రోజున 21.66 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి కోటి రూపాయల ఆదాయం అదనంగా లభించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9000 బస్సులు నడపగా 18.25 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు అప్పుడే ప్రకటించారు. రాఖీ పండుగ రోజు 40.91 ఒక లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించారు.
ALSO READ : మాడ్గులపల్లి : తల్లితండ్రులు మందలించారని.. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య..!
తెలంగాణ రాష్ట్రంలోనే నల్లగొండ టాప్ :
తెలంగాణ రాష్ట్రంలోనే ఆర్కిపెన్సి రేషియో విషయంలో నల్లగొండ డిపో రికార్డు సృష్టించింది. నల్లగొండ జిల్లా గత ఏడాది రికార్డును కూడా అధిగమించింది. రాఖీ పౌర్ణమి మాదిరిగానే దసరాకు కూడా ఆర్టీసీలో ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉన్నందున అప్ అండ్ డౌన్ టికెట్లు ఒకేసారి బుక్ చేసుకుంటే 10% రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించింది.
ALSO READ : రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ.. రాజకీయ విమర్శలు చేస్తున్న గుత్తా..!










