Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్ట్..!

Miryalaguda : ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్ట్..!

వీరి వద్ద నుండి 2 లక్షల 77 వేల రూపాయలు

రెండు సెల్ ఫోన్లు స్వాధీనం

నల్లగొండ, మనసాక్షి

పార్కింగ్ చేసిన ఉన్న వాహనాలను టార్గెట్ గా అద్దాలు పగలగొట్టి డబ్బులు దొంగలించే ఇద్దరూ అంతర్ రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు నిందితుల వివరాలను వెల్లడించారు.

పెద్దవూర మండలం చిన్న గూడెం గ్రామానికి చెందిన రావుల శంకర్ అనే వ్యక్తి అవంతిపురంలో సంతలో తన గొర్రెలను అమ్ముకుని వచ్చిన 97 వేల రూపాయల డబ్బులు ఏసీ కారులోని ముందు క్యాబిన్లో పెట్టి తన గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలో హోటల్లో భోజనం చేసి తిరిగి వచ్చి కారును పరిశీలించగా తన డబ్బును ఎవరో దొంగలించుకోపోయినారని విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విషయమై దర్యాప్తు చేయగా గురువారం బాదలాపురం బస్ స్టేజి వద్ద కోదాడ జడ్చర్ల ఎన్హెచ్ 167 రోడ్డుపై వాహనాలు చేస్తుండగా ఎట్టికాకారులు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తుండగాగా వారికారును ఆపి చూడగా వారి వాహనంలో అద్దాలను పగలగొట్టదానికి వాడే పనిముట్లు కొంత నగదు కలిగి ఉండగా వారిద్దరిని విచారించగా వారు పై నేరంతో పాటు మిర్యాలగూడలో రెండు చోట్ల నగదు దొంగలించిన కేసులను కూడా తెలిసినట్లు తెలిపారు.

నేరస్తులు అయిన నెల్లూరు జిల్లా బోగోలు మండలం కప్రాల తిప్ప గ్రామానికి చెందిన పిట్ల మహేష్ , ఆవుల రాకేష్లను, అరెస్ట్ చేసినట్లు తెలిపారు ,వీరివద్ద నుండి 97 వేల నగదు, కారు, కొన్ని పనిముట్లు, కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసును త్వరితగతిన చేదించిన మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ చెందిన పిసీలను డిఎస్పి అభినందించారు.

ALSO READ : Telangana : కాంగ్రెస్ నేత వంశీ చందర్ రెడ్డి కెసిఆర్ కు సంచలన లేఖ..!

మరిన్ని వార్తలు