Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

పిడుగుపాటుకు ఇద్దరు యువతులు మృతి..!

పిడుగుపాటుకు ఇద్దరు యువతులు మృతి..!

దమ్మపేట, మన సాక్షి :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ఇద్దరు యువతులు సున్నం అనూష (23),కట్టం నాగశ్రీ (23) మృతి చెందారు .  మరో యువతీ మడకం సీతమ్మ పరిస్థితి విషమంగ ఉంది.

స్దానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గారం లో కౌలు వ్యవసాయం చేస్తున్న రవిరాజు చేలో పనులకు వెళ్ళిన కూలీల సమీపంలో పిడుగు పడటంతో షాక్ గురైన ముగ్గురిని హుటాహుటిన సత్తుపల్లి లోని విజేత వైద్యశాల కు తరలించారు.

అనూష ,నాగశ్రీ లు మృతి చెందగా , సీతమ్మని మెరుగైన వైద్యంకోసం ఖమ్మం వైద్యశాలకు తరలిస్తున్నట్లు సమాచారం. పిడుగుపాటుకు గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర సోకసముద్రంలో మునిగిపోయారు. జగ్గారం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండి :

మరిన్ని వార్తలు