Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

TG News : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు..!

TG News : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు..!

సూర్యాపేట, మన సాక్షి:

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల ప్రకారం..

సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని కటకమ్మ గూడెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. హైదరాబాద్ నుంచి గోకవరం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.

కోదాడ సమీపంలో ప్రయాణికుల కోసం రోడ్డు పక్కన బస్సు డ్రైవర్ ఆపారు. ఆ సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టింది. దాంతో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.

క్షతగాత్రులను  కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు