తెలంగాణBreaking Newsఉద్యోగంటెక్నాలజీహైదరాబాద్

Mega Job Mela : గందరగోళంగా మెగా జాబ్ మేళా.. వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు..!

Mega Job Mela : గందరగోళంగా మెగా జాబ్ మేళా.. వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు..!

మన సాక్షి, హైదరాబాద్ :

జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళా గందరగోళంగా మారింది. 100 కంపెనీలు 20వేల ఉద్యోగాలు అంటూ జాబ్ మేళా నిర్వహించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య భారీగా ఉండటంతో జాబ్ మేళా కు భారీగా తరలివచ్చారు.

కూకట్ పల్లిలోని జేఎన్టీయూహెచ్ కార్యాలయం వద్ద ఉదయం 9 గంటలకు ప్రారంభమైన జాబ్ మేళాకు నిర్వాహకులు ఏర్పాట్లు చేయకపోవడంతో నిరుద్యోగుల్లో నిరాసక్తి నెలకొన్నది. జాబ్ మేళాకు వచ్చిన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన నిర్వాహకులు వారికి నెంబర్లు, పేర్లు కానీ పిలవకుండా క్యూలైన్లలో ఉండాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.

పదవ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్ని అర్హతలు ఉన్నవారికి జాబ్ మేళా నిర్వహించారు. కానీ విభాగాల వారీగా దరఖాస్తులు స్వీకరించి ఇంటర్వ్యూలు నిర్వహించకుండా అందరిని క్యూలైన్లలో ఉంచడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో మధ్యాహ్నం వరకు ఉన్న నిరుద్యోగులు చాలామంది వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది.

జాబ్ మేళాకు దరఖాస్తులు చేసుకున్న వారికి మరోసారి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారా.? లేదా..? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. అప్లికేషన్లలో నెంబర్ల ఆధారంగా మరో సారి ఇంటర్వ్యూకు పిలవాలని నిరుద్యోగులు పేర్కొంటున్నారు.

MOST READ :

  1. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Ration Cards : మార్చి 1న వారికే స్మార్ట్ రేషన్ కార్డులు.. లేటెస్ట్ అప్డేట్..!

  3. TG News : ముదురుతున్న ఎండలు.. ఎండుతున్న పంటలు..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రేషన్ కార్డులు కట్..!

  5. Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు