తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Miryalaguda : అకాల వర్షం.. నేలపాలైన వరి పంట..!

Miryalaguda : అకాల వర్షం.. నేలపాలైన వరి పంట..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం పడటం వల్ల నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో వారి పంట నేల వాలింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఆదివారం సాయంత్రం మిర్యాలగూడ నియోజకవర్గంలో కురిసింది. దాంతో కోతకు వచ్చిన వరి పంట పొలాలు నేల వాలాయి. రైతులకు భారీ నష్టం వాటిల్లింది.

మరో 15 రోజుల్లో వరి కోతకు వచ్చిన పంట పొలాలు పూర్తిగా నేల వాడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి పండించిన పంట చేతికొచ్చే ముందు అకాల వర్షం కారణంగా దెబ్బతినడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు.

మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఉట్లపల్లి , తడకమళ్ళ, తక్కెళ్ళపాడు, దొండవారి గూడెం పరిసర గ్రామాలలో వందల ఎకరాలలో వరి పంట నేల వాలింది. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు పరిశీలించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు