Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయంసంక్షేమం

Good News : మహిళలకు శుభవార్త, వడ్డీ లేకుండా రూ.5 లక్షలు.. దరఖాస్తు ఇలా..!

Good News : మహిళలకు శుభవార్త, వడ్డీ లేకుండా రూ.5 లక్షలు.. దరఖాస్తు ఇలా..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

కేంద్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్త తెలియజేసింది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారికి వడ్డీ లేకుండా రుణాలను అందించనున్నది.

కేంద్ర ప్రభుత్వ పథకమైన లక్పతి దీదీ యోజన స్కీమ్ లో మహిళలకు 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను అందించనున్నది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రారంభించింది. ఇది పూర్తిగా మహిళలకే అందించనున్నది.

అయితే ఈ పథకాన్ని పొందడానికి మహిళలు ఏం చేయాలంటే.. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉండాలి. స్వయం సహాయక సంఘాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. ఈ బృందంలో ఆ మహిళ సభ్యురాలుగా ఉండాలి.

తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించుకోవాలని ఆమె తన వ్యాపార ప్రణాళికతో స్వయం సహాయక బృందం ద్వారా సంబంధిత బ్యాంకులో దరఖాస్తు చేసుకో వచ్చును. సభ్యురాలు దరఖాస్తును పంపిస్తారు. అయితే స్వయం సహాయక సంఘంలో ఉండి నిర్వహించుకోవాల్సిన వ్యాపారాన్ని బ్యాంక్ అధికారులు తనిఖీ చేస్తారు.

తర్వాత మీకు 5 లక్షల రూపాయల వరకు రుణాన్ని మంజూరు చేస్తారు. ఈ పథకం ద్వారా అందజేసే రుణాలు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే స్వయం సహాయక సంఘంలో ఉండి గతంలో రుణం తీసుకొని ఉన్నట్లయితే ఈ పథకం వర్తించదు. పాత రుణం గడువులోగా తీర్చడం కానీ వాయిదాలు క్రమంగా కట్టడం ద్వారా కానీ వారికి మరిన్ని రుణాలు అందజేసే అవకాశం ఉంటుంది.

MOST READ : 

మరిన్ని వార్తలు