Rain : వడగండ్ల వర్షంతో ధ్వంసమైన వరి, మామిడి తోటలు
Rain : వడగండ్ల వర్షంతో ధ్వంసమైన వరి, మామిడి తోటలు
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్
రుద్రంగి, (మనసాక్షి)
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, రుద్రంగి మండలంలో గత రెండు మూడు రోజులుగా కురిసిన వడగండ్ల వర్షం వల్ల ధ్వంసమైన వరి,సొయా,నువ్వు,పంటలతో పాటు మామిడి తోటలను సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూటికి నూరు శాతం వరి పంట పూర్తిగా దెబ్బతిందని, అనేక వందల ఎకరాలు నష్టపోయిన వరి పంట రైతుకు ఎకరాకు 25 వేల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మామిడి తోటకు ఉద్యాన వన శాఖ ద్వారా వారికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ప్రధానంగా ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన సమయంలో వడగళ్ల వనాతో ఇలా జరగడం రైతుకు అనేక తీవ్ర నష్టం జరిగింది అని అన్నారు. వడగండ్ల వాన వల్ల గత మూడు రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇదేవిధంగా వర్షాలు పడుతున్నాయని వారు అన్నారు.
ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల గత 15 రోజుల క్రితమే వడ్ల కోత కోసి కేంద్రాలకు తీసుకొస్తున్న తరుణంలో ఇంకా కొనుగోలు చేయకపోవడం వల్ల వర్షాల వల్ల వరి ధాన్యం నీళ్ళపాలైంది అని అన్నారు. వెంటనే యుద్ధ ప్రతిపాదికగా వడ్ల కొనుగోలు చెయ్యాలని అన్నారు. తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని, ఇసుక లారీలతో, ట్రాక్టర్ లతో వడ్ల ను కొనుగోలు కేంద్రాలకు తరలించండి అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చేలుకల తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి,గడ్డం శ్రీనివాస్, ఎర్రo గంగా నర్సయ్య,తర్రె లింగం, అభిలాష్,గుగ్గిళ్ల వెంకటేష్,ఇప్పు మహేష్,చేలుకల గంగాధర్,మహిపాల్, అక్కినపెల్లి శ్రీనివాస్,గంధం మనోజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,రైతులు పాల్గొన్నారు.









