Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకామారెడ్డి జిల్లాక్రైంతెలంగాణ

BREAKING : వాహనాల తనిఖీలు.. రూ. 2.50 లక్షల పట్టివేత..!

BREAKING : వాహనాల తనిఖీలు.. రూ. 2.50 లక్షల పట్టివేత..!

నాగిరెడ్డిపేట్, మన సాక్షి:

పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా కామారెడ్డి, మెదక్, జిల్లాల సరిహద్దు ప్రాంతమైన పోచారం గ్రామంలో ప్రధాన రహదారిపై ఏర్పాటుచేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద గురువారం వాహనాల తనిఖీలలో ఎలాంటి ఆధారాలు లేకుండా రెండు లక్షల 50 వేల రూపాయలు పట్టుకొని సీజ్ చేసినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

కోడిపల్లి మండలం బురుగు గడ్డ గ్రామానికి చెందిన జి కుమార్ అనే వ్యక్తి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రెండు లక్షల రూపాయలు, ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళుతున్నాడని అలాగే వర్ధన్న పేట్ మండలం బొక్కల గూడెం గ్రామానికి చెందిన, ఎండి, షాన్ అనే వ్యక్తి 50 వేల ఒక్క 100 రూపాయలు, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళుతున్నాడని పోలీసులు పట్టుకుని డబ్బులను సీజ్ చేసినట్లు తెలిపారు.

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమంగా డబ్బులను, తరలించినట్లయితే స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేస్తామని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో, స్థానిక ఎస్సై రాజు, ఏఎస్ఐ ఉమేష్, పోలీస్ సిబ్బంది ఎస్ఎస్ టి టీం తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Liquor : బారీగా కర్ణాటక మద్యం పట్టివేత.. నిందితుడు అరెస్ట్..!

మరిన్ని వార్తలు