Liquor : బారీగా కర్ణాటక మద్యం పట్టివేత.. నిందితుడు అరెస్ట్..!

కర్ణాటక మద్యం అక్రమంగా విక్రయిస్తున్న నిదుతున్ని పోలీసులు అరెస్టు చేశారు.అరెస్ట్ అయిన నిందితుడి వద్ద రూ. 58 వేల ఏవైనా కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను సీజ్ చేశారు.

Liquor : బారీగా కర్ణాటక మద్యం పట్టివేత.. నిందితుడు అరెస్ట్..!

రామసముద్రం, మన సాక్షి :

కర్ణాటక మద్యం అక్రమంగా విక్రయిస్తున్న నిదుతున్ని పోలీసులు అరెస్టు చేశారు.అరెస్ట్ అయిన నిందితుడి వద్ద రూ. 58 వేల ఏవైనా కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను సీజ్ చేశారు.

నిధితుడి అరెస్టుకు సంబంధించి మదనపల్లి రూరల్ సర్కిల్ సీఐ సద్గురుడు, ఎస్ఐ చంద్రశేఖర్ కథనం మేరకు.. పుంగనూరు మండలం అలజనేరు గ్రామంలో ఉండే మారప్ప గారి సుబ్రహ్మణ్యం(32) కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా 768 కర్ణాటక మద్యం ప్యాకెట్లను అమ్మకానికి సిద్ధంగా ముంచినట్లు సమాచారం అందిందన్నారు.

వెంటనే తనతో పాటు ఎస్ఐ చంద్రశేఖర్ సిబ్బందితో వెళ్లి సోదాలు జరిపి రూ.58 వేల రూపాయల విలువైన కర్ణాటక మద్యం ప్యాకెట్లను సీజ్ చేసి నిందితున్ని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ అనంతరం అతనిఫై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సీఐ సద్గురుడు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.