Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : నల్గొండ జిల్లా గుర్రంపోడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..!
నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం చేపూర్ ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది.

Nalgonda : నల్గొండ జిల్లా గుర్రంపోడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..!
గుర్రంపోడు, మన సాక్షి :
నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం చేపూర్ ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. మృతులు గుర్రంపోడ్ మండలానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









