Nagar Kurnool : ఉపాధి పనులు అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!
వెల్దండ మండలంలోని పోతేపల్లి గ్రామంలో బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్ ఆకస్మిక తనిఖీ చేశారు.

Nagar Kurnool : ఉపాధి పనులు అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!
వెల్దండ, మన సాక్షి:
వెల్దండ మండలంలోని పోతేపల్లి గ్రామంలో బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. కూలీలకు పని ప్రదేశంలో త్రాగునీరు, మెడికల్ కిట్టులు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ అదనపు కలెక్టర్ మరియు ఎంపీడీవోలను శాలువాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు.
అనంతరం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి, పాఠశాల భవనంలో ఒక గది ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉండటంపై అదనపు కలెక్టర్ ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి త్వరలో గృహప్రవేశాలు నిర్వహించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఈసం కృష్ణయ్య, ఎంపీఓ లక్ష్మణ్, ఏపీవో ఈశ్వర్ జీ, పంచాయతీ కార్యదర్శి రూప్సింగ్, టెక్నికల్ అసిస్టెంట్స్, క్షేత్ర సహాయకులు, ఉపాధి హామీ కూలీలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.









