Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : రెండవ విడతలో కూడా రైతు భరోసా వారికే..!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా పథకం రెండవ విడత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా రైతుల ఖాతాలలో మంగళవారం జమ అయ్యాయి.

Rythu Bharosa : రెండవ విడతలో కూడా రైతు భరోసా వారికే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా పథకం రెండవ విడత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా రైతుల ఖాతాలలో మంగళవారం జమ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 45,,11, 947 మంది రైతులకు 2206 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేసింది.

కాగా ఇప్పటివరకు ప్రభుత్వం మొదటి విడతలో 3446 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయగా, రెండవ విడతలో 2206 కోట్ల రూపాయలను మొత్తంగా 5653 కోట్ల రూపాయలను 71.05 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేసింది.

ఇదిలా ఉండగా మొదటి విడతలో రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం అందెందుకు ఎకరం భూమి ఉన్న రైతులకు రైతులకు 6000 రూపాయల చొప్పున ఖాతాలలో జమ చేసింది. కాగా రెండవ విడతలో ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు జమ చేస్తారని భావించారు.

కానీ రెండవ విడతలో కూడా ఎకరం వరకు మాత్రమే జమ చేసింది. ఎకరానికి 6000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేశారు. మూడవ విడుత రైతులందరికీ రైతు భరోసా అందాలంటే మరో 3400 కోట్ల రూపాయలు అవసరం ఉంది.

మరిన్ని వార్తలు