Devarakonda : దేవరకొండ సిఐ గా బాధ్యతలు చేపట్టిన వెంకట్ రెడ్డి.!

Devarakonda : దేవరకొండ సిఐ గా బాధ్యతలు చేపట్టిన వెంకట్ రెడ్డి.!
దేవరకొండ, మనసాక్షి :
దేవరకొండ టౌన్ పోలీస్ స్టేషన్ కు నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) గా పోసిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో వివిధ ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది. ఈ సందర్భంగా సీఐ పోసిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దేవరకొండ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, వీటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రోడ్డు భద్రతా నిబంధనల అమలుపై కూడా దృష్టి సారిస్తామని చెప్పారు.
ప్రజలు పోలీసులకు సహకరించి, శాంతియుత వాతావరణాన్ని కాపాడడంలో భాగస్వామ్యం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏదైనా సమస్యలు లేదా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
MOST READ :









