WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే ప్రైవసీ.. సెండ్ చేసినా సేవ్ చేసుకోలేరు..!

WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే ప్రైవసీ.. సెండ్ చేసినా సేవ్ చేసుకోలేరు..!
మన సాక్షి, వెబ్ డేస్క్ :
ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్ గా వాట్సప్ ఉంది. కోట్లాది మంది ప్రజలు వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. భారతదేశంలో అత్యధికంగా వినియోగించే వారిలో వాట్సప్ మెసేజింగ్ యాప్ ఉంది. అత్యంత వేగంగా వీడియోలు, ఫోటోలు షేర్ చేయడానికి ప్రధాన సాధనంగా వాట్సాప్ ను వినియోగిస్తున్నారు.
అయితే వాట్సాప్ లో మనం ఎవరికైనా ఫోటోలు, వీడియోలు పంపితే వారు వాటిని గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చును. కానీ అలా అవతలి వారు సేవ్ చేసుకోకుండా చేయగలిగితే ఇంకా బాగుంటుంది కదా..? సరిగ్గా ఈ సదుపాయాన్ని మనకు వాట్సప్ అందించబోతోంది. దాంతోపాటు మరికొన్ని ప్రైవసీకి సంబంధించిన ఫీచర్లను కూడా వాట్సప్ తీసుకురాబోతోంది. ప్రైవసీ కి సంబంధించిన ఫీచర్లను తీసుకురాబోతున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొన్నది.
వాట్సాప్ యాప్ లో మనం ఎవరికైనా ఫోటోలు, వీడియోలు పంపిస్తే వాటిని అవతలి వారు వారి గ్యాలరీలో సేవ్ చేస్తూ ఉంటారు. కానీ వాటిని సేవ్ చేసుకోకుండా యూజర్లకు ఆప్షన్ వాట్సాప్ ఇవ్వనున్నది. పూర్తిస్థాయి ప్రైవసీని కల్పించబోతుంది. ప్రైవసీ సెట్టింగ్స్ లో ఉండబోయే ఈ ఆప్షన్ ను ఆన్ చేసుకుంటే అవతలి వ్యక్తులు ఆ ఇమేజ్ ని గాని లేదా వీడియోలు గాని సేవ్ చేయాలనుకున్నప్పుడు “సేవ్ చేయడం కుదరదు” అని మెసేజ్ కనిపిస్తుంది.
దీనిని ఆఫ్ చేసుకున్నప్పుడు అవతలి వారు సేవ్ చేసుకోవచ్చును. అయితే ఇప్పుడు వన్ టైం సెండ్ ఆప్షన్ ద్వారా కూడా ఇలా చేయవచ్చును. కానీ అవతలి వారు మనం పంపిన ఫోటో కానీ వీడియో కానీ ఒకేసారి చూసే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా ఎక్స్పోర్ట్ చాట్ హిస్టరీ విషయంలో కూడా యూజర్లకు మరో ప్రైవసీని కల్పించబోతోంది. అడ్వాన్స్ చాట్ ప్రైవసీని ఆన్ చేసుకుంటే అవతలి వ్యక్తులు ఆ సందేశాలను ఎక్స్పోర్ట్ చేయలేరు. ప్రస్తుతం డిజాపియరింగ్ ఫీచర్ ద్వారా కూడా నిర్ణీత సమయం దాటిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ సందేశాలు తొలగిపోయే వెసులుబాటు ఉంది.
అయితే వాట్సాప్ తీసుకు రాబోయే ఈ ఫీచర్ ఇంకా కాస్త భిన్నంగా పనిచేయబోతోంది. ఈ ఫీచర్లు ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయి. త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి.
Similar News :
-
WhatsApp : వాట్సాప్ స్టేటస్ అదిరిపోయేలా సాంగ్ యాడ్ చేయొచ్చు తెలుసా.. ఎలా అంటే..!
-
WhatsApp : వాట్సప్ హ్యాకర్ల నుంచి రక్షించుకోవడం ఎలా..!
-
WhatsApp : మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్.. ఎలా చేస్తారంటే.. బిగ్ అలర్ట్..!
-
WhatsApp : వాట్సాప్ యూజర్స్ కు బిగ్ అలర్ట్.. జీరో క్లిక్ హ్యాకింగ్..!
-
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. వారికి కూడా కాల్ చేయొచ్చు..!









