WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయినవి తిరిగి పొందవచ్చు.. అందుబాటులో అదిరిపోయే ఫీచర్స్..!
WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయినవి తిరిగి పొందవచ్చు.. అందుబాటులో అదిరిపోయే ఫీచర్స్..!
మనసాక్షి , ఇంటర్నెట్ :
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ రోజురోజుకు అద్భుతమైన ఫీచర్లను తీసుకువస్తుంది. వినియోగదారులకు అత్యాధునికమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. అతి ఎక్కువమంది వినియోగించే యాప్ లలో వాట్సప్ గా చెప్పవచ్చును. ఎంతటి జనాధరణ వాట్సప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాట్సాప్ ను చాలామంది వినియోగిస్తుంటారు. కానీ అందులో ఉన్న ట్రిక్స్ కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంటాయి. అవేంటో తెలుసుకుందాం..
కొన్ని పర్యాయాలు మనకు వాట్సప్ లో వచ్చిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ, అనుకోకుండా కొన్ని ముఖ్యమైన వి కూడా డిలీట్ అవుతాయి. అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. డిలీట్ అయిన ఫోటోలు, వీడియోలను కూడా తిరిగి పొందే అవకాశం ఉంది. అది ఎలా అంటే తెలుసుకుందాం..
డిలీట్ అయిన ఫోటోలు, వీడియోలను తిరిగి పొందడానికి పెద్ద టెక్నికల్ కూడా అవసరం లేదు. ఈ స్పెషల్ ట్రిక్ ఓ సారి పరిశీలిస్తే సరిపోతుంది.
ALSO READ : Mobile Net : మీ మొబైల్ లో నెట్ స్లో అయ్యిందా.. ఈ మార్పులు చేయండి.. రాకెట్ వేగంతో నెట్ స్పీడ్..!
డిఫాల్ట్ గా వాట్సాప్ కు సంబంధించి అన్ని ఫోటోలు, వీడియోలు కూడా ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటి ఫోన్ గ్యాలరీలో సేవ్ అవుతుంటాయి. మీ వాట్సాప్ నుంచి వీడియో, ఫోటో డాక్యుమెంట్ ఫైల్ ఏదైనా డిలీట్ అయితే వాటిని ఫోన్ గ్యాలరీలో తిరిగి పొందవచ్చును.
అదేవిధంగా ఇక్కడ మీరు ఫైల్ ఎక్స్ ప్లొరర్ గురించి తెలుసుకోవాల్సి ఉంది . ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు ఫైల్ ఎక్స్ ప్లొరర్ లోని వాట్సప్ ఫోల్డర్ కు వెళ్లడం ద్వారా వీడియో ఫైల్ ల నుండి తొలగించబడిన ఫోటోలు వీడియోలను తిరిగి పొందవచ్చును.
ALSO READ : Vinayaka Statues : ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కు మించి ఆకర్షవంతంగా.. మట్టి వినాయక విగ్రహాలు తయారీ..!
అంతేకాకుండా వాట్స్అప్ బ్యాకప్ కూడా వాడుకోవచ్చును. మీరు వాట్సాప్ చాట్ లు మీడియాను రోజువారి, వారం, నెలవారీగా ప్రతిపాదించిన బ్యాకప్ చేయవచ్చును. అదేవిధంగా డిలీట్ మీడియా ఆప్షన్ ఆఫ్ చేసినా సరిపోతుంది. కొన్ని పర్యాయాలు మనం చాట్ ని డిలీట్ చేసినప్పుడు కొన్ని ముఖ్యమైన మీడియా ఫైల్స్ కూడా పొరపాటున డిలీట్ అవుతుంటాయి. ఇలాంటి సమస్య నుండి బయట పడేందుకు చాట్ ను డిలీట్ చేసేముందు డిలీట్ మీడియా ఆప్షన్ ను టిక్ చేయకుండా ఉంచండి సరిపోతుంది.
బ్రాడ్ కాస్ట్ తరహాలో వాట్సప్ :
ఛానల్ బ్రాడ్ కాస్ట్ తరహాలో వాట్సాప్ ఛానల్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో సందేశాలు పంపవచ్చు. ఇది వన్ వే ఛానల్. ప్రపంచవ్యాప్తంగా ఈ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు వాట్సప్ తెలియజేసింది. మీరు అనుకున్న వ్యక్తులు, సంస్థల నుంచి కావలసిన అప్డేట్లను ఈ ఛానల్ ద్వారా కూడా పొందే అవకాశం ఉంది.
ఇది సాధారణ చాట్ లతో పోలిస్తే కాస్త మెరుగైనదిగా చెప్పవచ్చును. వ్యక్తులు, సంస్థలను ఫాలో అయ్యే వారి వివరాలు ఇతర ఫాలోవర్స్ కు తెలియకుండా ఉంటాయి. బ్రాడ్ కాస్ట్ లా ఉంటుంది. ఈ ఛానల్ అడ్మినిస్ట్రేటర్ తమ ఫాలోవర్లకు టెక్స్ట్, ఫోటోలు వీడియోలు , స్టిక్కర్లు, పోల్స్ లను పంపించుకోవచ్చును. అందుకోసం అప్డేట్స్ అనే ట్యాబ్ ను వాట్సప్ తీసుకొస్తుంది.
ఇందులో స్టేటస్ లతో పాటు ఛానల్ కు సంబంధించిన సమాచారం కూడా కనిపిస్తుంది. అందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నది.










