Whatsapp : త్వరలో ఈ ఫోన్లలో వాట్సప్ బంద్.. లిస్ట్ ఇదిగో..!
Whatsapp : త్వరలో ఈ ఫోన్లలో వాట్సప్ బంద్.. లిస్ట్ ఇదిగో..!
మన సాక్షి , వెబ్ డెస్క్:
వాట్సప్ రోజురోజుకు కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. సరికొత్త ఫీచర్లతో పాటు ఇటీవలనే వాట్స్అప్ ఛానల్ కూడా ప్రారంభమైంది. కానీ కొన్ని వర్షన్లలో ఉన్న ఫోన్ లకు వాట్సప్ నిలిచిపోనున్నది. కొన్ని పాత డివైజ్ లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి.
అక్టోబర్ 24 నుంచి ఎంపిక చేసిన డివైజ్ లల్లో వాట్సప్ మూగబోనున్నది. ఆండ్రాయిడ్ ఐఓఎస్ వెబ్ వర్షన్ వాడే యూజర్లకు సెక్యూరిటీ పరంగా అప్డేట్లను అందిస్తూ ఉంది. అదే సమయంలో పాతతరం ఆపరేటింగ్ సిస్టమ్ లు వాడే డివైస్ లకు వాట్సాప్ సపోర్టు నిలిపివేస్తూ ఉంటుంది.
తాజాగా ఆండ్రాయిడ్ 4.1 ఓఎస్ వాడుతున్న ఫోన్లకు వాట్సప్ సపోర్ట్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇది అక్టోబర్ 24 వ తేదీ నుంచి అమల్లోకి రానున్నది. పాత తరం అతి తక్కువ మంది వాడే డివైస్ లకు సపోర్టును ఉపసంహరించుకుంటున్నట్లు వాట్సాప్ తెలియజేసింది. అన్ని టెక్నాలజీ కంపెనీలు అదే పని చేస్తున్నాయని పేర్కొన్నది.
దానికోసం ఆండ్రాయిడ్ 4.1 ఓఎస్ అంతకంటే తక్కువ వర్షన్ తో పనిచేస్తున్న కొన్ని ఫోన్ల లిస్టును ప్రకటించింది. వాట్సాప్ నిలిపివేసే జాబితాలో ఉన్న ఫోన్లు ట్యాబ్ లు పెద్దగా వాడకంలో లేనప్పటికీ ఒకవేళ ఎవరైనా వాడుతున్నట్లయితే కొత్త డివైజ్ కు అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచించింది. వాట్స్అప్ సపోర్టు నిలిచిపోతే ఆయా ఫోన్లకు సందేశాలు కూడా నిలిచిపోతాయి.
అయితే పాత డివైజ్ లు అయినప్పటికీ ఆండ్రాయిడ్ ఓ ఎస్ వర్షన్ 5.0 , ఐఫోన్ 12, కాయ్ ఎస్ 2. 5.0 ( జియో ఫోన్లు) ఓఎస్ లతో నడుస్తున్న డివైజ్ ల లో వాట్సాప్ సేవలు కొనసాగుతాయి.
అయితే వాట్సాప్ నిలిచిపోయే ఫోన్ల జాబితా ఇదే :
నెక్సస్ 7, సాంసంగ్ గెలాక్సీ నోట్ 2 , హెచ్ టీ సి వన్, సోనీ ఎక్స్పీరియా జెడ్, ఎల్ జి ఆప్టిమస్ జి ప్రో, సామ్సంగ్ గెలాక్సీ s2, సాంసంగ్ గెలాక్సీ నెక్స్, HTC సెన్సేషన్, మోటోరోలా డ్రాయిడ్ రేజర్, సోనీ ఎక్స్పీరియా ఎస్ 2, మోటోరోలా జూమ్, సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ 10.1, ఆసుస్ ఈ ప్యాడ్, ట్రాన్స్ఫార్మర్, ఏసర్ ఐసోనిక్ ట్యాబ్ ఏ 5003, సామ్సంగ్ గెలాక్సీ ఎస్ , హెచ్ టి సి డిజైర్ హెచ్ డి, ఎల్ జి ఆప్టిమస్ 2 ఎక్స్ , సోనీ ఎరిక్సన్ ఎక్స్పీరియా ఆర్క్ 3 ఫోన్ లలో వాట్స్అప్ నిలిచిపోయే జాబితాలో ఉన్నాయి.
మరిన్ని వార్తలు :
- అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆర్థికపరమైన విషయాల్లో పలు మార్పులు.. అవి ఏంటో తెలుసుకుందాం..!
- Bank Balance : మీ బ్యాంకులో బ్యాలెన్స్ రూపాయి కూడా లేదా.. అయినా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు.. అది ఎలాగో తెలుసుకుందాం..!
- Software : ఈ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం గ్యారెంటీ.. అవేంటో తెలుసుకుందాం..!
- Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!










