TOP STORIESBreaking Newsక్రైం

WhatsApp : వాట్సప్ యూజర్లే నేరగాళ్ల టార్గెట్.. అప్రమత్తం లేకుంటే మీ ఎకౌంటు ఖాళీ.. ఆ బ్యాంక్ సలహాలు..!

WhatsApp : వాట్సప్ యూజర్లే నేరగాళ్ల టార్గెట్.. అప్రమత్తం లేకుంటే మీ ఎకౌంటు ఖాళీ.. ఆ బ్యాంక్ సలహాలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ప్రస్తుతం సోషల్ మీడియా కాలంలో సైబర్ నేరగాళ్లు ఎక్కువగా సోషల్ మీడియానే ఎంచుకుంటున్నారు. అలర్ట్ గా ఉండాలని పోలీసులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఇంకా సైబర్ నేరగాల్లు కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. సరికొత్తగా వాట్సప్.. ఆ మోసగాళ్లకు అడ్డగా మారిపోతుంది. ఫేక్ ఏపీకే ఫైల్స్ లేదా ఎకౌంట్ల ద్వారా యూజర్ లను నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు.

అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లను అప్రమత్తం చేసింది. అయితే కొంతమంది మోసగాళ్లు సోషల్ మీడియాలో బ్యాంక్ పేరు మీద ఫేక్ వీడియో విడుదల చేసి తమ పేరు, లోగోను దుర్వినియోగం చేస్తూ ప్రజలను ట్రాప్ చేస్తున్నట్లు పేర్కొన్నది.

బ్యాంకు స్టాక్ మార్కెట్ చిట్కాలను అందిస్తుందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలు సర్కులేట్ చేస్తున్నట్లు బ్యాంకు హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు కేవలం వారం రోజుల్లో డబ్బులు రెట్టింపు చేసే స్టాక్ మార్కెట్ పెట్టుబడి చిట్కాలను అందిస్తామని తప్పుడు వాగ్దానాలు చేస్తున్నట్లు బ్యాంకు హెచ్చరించింది.

అలాంటివారు కొన్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రజలను చేర్చుకొని మోసగిస్తున్నట్లు బ్యాంకు తెలియజేసింది. తాము అలాంటి బాధ్యతా రహితమైన రాబడి కి హామీ ఇస్తూ ఎలాంటి స్కీమ్స్ ఆఫర్ చేయబోమని వెల్లడించింది.

స్టేట్ బ్యాంకు సలహాలు :

  • అధిక రాబడులను ఆశ చూపుతూ వచ్చే తప్పుడు ప్రకటనలను నమ్మొద్దని బ్యాంకు పేర్కొన్నది.

  • తప్పుడు వాట్సప్ గ్రూపుల నుంచి తమ దృష్టికి వస్తే వాటిపై అధికారులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నది.

  • స్టేట్ బ్యాంక్ అందించే సేవలను నిర్ధారించుకోవడానికి సమీపంలోని ఏదైనా బ్యాంకు శాఖను సందర్శించాలి. లేదా అధికారిక వెబ్సైట్ లో పరిశీలించాలని కోరింది.

  • అధికారిక సోర్సెస్ లేదా యాప్ ద్వారానే సేవలను పొందాలని బ్యాంకు సూచించింది.

  • ఏదైనా బ్యాంకు పేరుతో ఉచిత పెట్టుబడి టిప్స్ అందిస్తామంటూ వాట్సప్ లేదా ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో నిందితులను సంప్రదిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.

  • ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ అధికారులు లేదా బ్యాంకు దృష్టికి తీసుకెళ్లడం మంచిదని తెలియజేసింది.

MOST READ : 

  1. Miryalaguda : మిర్యాలగూడలో నేటి నుంచి ఈశ్వర బంధం ప్రారంభం.. అభివృద్ధిని ఎవ్వరు ఆపినా ఆగదు..!

  2. Alumni : దోస్త్ మేరా దోస్త్.. 17 తర్వాత మధుర జ్ఞాపకాలు పంచుకున్న పూర్వ విద్యార్థులు..!

  3. Tea : టీ తో బిస్కెట్ కలిపి తింటున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే..!

  4. Rythu Bharosa : రైతు భరోసా లో కీలక మార్పులు.. బిగ్ అప్డేట్..!

  5. Tahsildar : భూ భారతి గ్రామ సదస్సుల తేదీలు ఇవే.. సద్వినియోగం చేసుకోవాలి..!

  6. Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడు.. వారికి లేదా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు