Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

Tahsildar : భూ భారతి గ్రామ సదస్సుల తేదీలు ఇవే.. సద్వినియోగం చేసుకోవాలి..!

Tahsildar : భూ భారతి గ్రామ సదస్సుల తేదీలు ఇవే.. సద్వినియోగం చేసుకోవాలి..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో భూసమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం (2025) అమలులో భాగంగా, జూన్ 3వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న సందర్భంగా కంగ్టి మండలంలోని 26 గ్రామాలలో భూభారతి రైతు సదస్సులను నిర్వహిస్తున్నట్లు జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల వారిగా ఈ సదస్సులు నిర్వహిస్తునట్లు తహసిల్దార్ సి.భాస్కర్ శనివారం తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…భూ యజమానులు, రైతులు తమ భూమి రికార్డుల యందు ఏమైనా తప్పులు ఉన్నా, లేదా అర్హత ఉండి రెవెన్యూ రికార్డుల యందు పేర్లు నమోదు కాకపోయినా, మరి ఇతర భూ సమస్యలు ఉన్నా జూన్ 3వ తేదీ నుంచి 20 తేదీ వరకు నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో రైతులు సమస్యల పరిష్కారం కోసం మీ గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు చేసుకుంటే పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు,సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మండలంలో రెండు టీంలు ఏర్పాటు 

మొదటి టీం తహసిల్దార్ సి.భాస్కర్, ఆర్ఐ మల్లేశ్వర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది వినోద్ కుమార్, జి.మోహన్, గోపాల్, మల్లేష్, ప్రవీణ్, శ్రీనివాస్, ఆధ్వర్యంలో భూ భారతి గ్రామసభలు నిర్వహిస్తారు. జూన్ 3న జమ్గి బీ, 4న జమ్గి కే,5న ఎంపల్లి ,6న వాల్మూర్ ,9న బాన్సువాడ ,10న దామరగిద్ద, 11న ఘనపూర్,12న రసోల్,13న ముర్కుంజాల్,16న చాప్టా కే,17న చాప్టా బి ,18న బోర్గి,19న చౌకన్ పల్లి ,20న తడ్కల్ గ్రామాల్లో ఈ తేదీలలో గ్రామసభలు ఉంటాయని పేర్కొన్నారు.

భూభారతి గ్రామసభ రెండు టీం 

రెండో టీం ఉప తహసిల్దార్ అబ్దుల్ ముగ్ని, ఆర్ఐ.తాజోద్దీన్,రాహుఫ్, మాణిక్యం, ఎం. సాయిలు, మల్లేష్ , సంజు, శంకర్ ఆధ్వర్యంలో భూ భారతి గ్రామసభలు నిర్వహిస్తారు. 3న దెగుల్ వాడి,4న భీంరా,5న నాగూర్ (కే),6న నాగుర్ (బీ), 9న సిద్ధంగిర్గా,10న ఎన్నెమూరి,11న రాంతీర్థ్ ,12న నగన్ పల్లి,13న గాజుల పాడ్,16 చుక్కల్ తీర్థ్ 17న తుర్కవడగాం,18న కంగ్టి గ్రామాల్లో గ్రామసభలు ఉంటాయని తెలిపారు.

MOST READ :

  1. District collector : భూ భారతి చట్టంలో సాదా బైనమా అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే..

  2. WhatsApp : వాట్సాప్ లో కొత్త ఫీచర్ ఇక టైపింగ్ లేదు.. మాట్లాడొచ్చు..!

  3. Subsidy Seeds : రైతులకు సబ్సిడీపై విత్తనాలు.. సద్వినియోపర్చుకోవాలి..!

  4. BaBa Vanga : 2025 లో ఏం జరగబోతోంది.. బాబా వంగా చెప్పిన భవిష్యవాణి ఏంటి.. తీవ్ర ఆందోళన..!

  5. TG News : రైతులకు శుభవార్త.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!

మరిన్ని వార్తలు