Diwali : దీపావళి పండుగ ఎప్పుడు..? ఎన్ని రోజులు సెలవులు..!
Diwali : దీపావళి పండుగ ఎప్పుడు..? ఎన్ని రోజులు సెలవులు..!
మన సాక్షి ,వెబ్ డెస్క్ :
ఇటీవల పండుగల గురించి క్యాలెండర్లో వేర్వేరుగా తేదీలు కనిపిస్తున్నాయి. దాంతో ప్రతి పండుగపై కూడా సందిగ్ధం నెలకొంటుంది. వేద పండితులు తెలియజేసిన ప్రకారం పండుగలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దీపావళి పండుగ హిందువులలో అతిపెద్దది, ముఖ్యమైనది కూడా. హిందూ మతంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.
హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏటా కార్తీక్ మాసంలోని కృష్ణపక్షంలో అమావాస్య తేదీన దీపావళిని జరుపుకుంటారు. ఇది కేవలం మనదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కూడా దీపావళి వేడుకలు నిర్వహిస్తుంటారు. దీపావళి పండుగ వేడుకలు ధన త్రయోదశి తో మొదలై ఐదు రోజులపాటు కొనసాగుతుంటాయి.
పండుగ రోజు లక్ష్మీదేవి, వినాయకుడు, కుబేర దేవతలను పూజిస్తారు. పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు ఇళ్లను శుభ్రం చేసుకుని, ఇంటిముందు ముగ్గులు వేసి దీపాలతో అలంకరించుకొని టపాసులు కాల్చడం ఆనవాయితీగా వస్తుంది. అయితే 20 24 లో దీపావళి తేదీ ఎప్పుడు..? ఈ సంవత్సరం కార్తీక అమావాస్య రెండు రోజుల్లో వస్తుంది.
దాని ప్రకారం దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి..? అనేది సందిగ్ధం కావచ్చును. కొందరు దీపావళిని అక్టోబర్ 31వ తేదీన నిర్వహించాలని, మరికొందరు నవంబర్ 1న జరుపుకోవాలని సూచిస్తున్నారు. అయితే దీపావళి పండుగ తేదీ కి సంబంధించి జ్యోతిష్య , వైదిక పూజా పండితులు ఏం సలహా ఇస్తున్నారంటే తెలుసుకుందాం..
శాస్త్రాల ప్రకారం దీపావళి పండుగ ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య తిధి నాడు జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది అమావాస్య తిధి అక్టోబర్ 31, నవంబర్ 1 రెండింటిలోనూ రావడం వల్ల గందరగోళం అయిన పరిస్థితి నెలకొన్నది. వేద క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3. 12 గంటలకు అమావాస్య తిధి ప్రారంభమవుతుంది. నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 .14 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పాడ్యమి ప్రారంభం అవుతుంది.
అయితే దీపావళి నాడు లక్ష్మీ పూజ, అమావాస్య తిధి ప్రదోష కాలాల్లో సూర్యాస్తమయం నుంచి అర్ధరాత్రి వరకు జరుగుతుంది. ఈ విధంగా చూస్తే అమావాస్య తిధి ప్రదోషకాలం శుభసమయాలు ఉన్న అక్టోబర్ 31వ తేదీన దీపావళిని జరుపుకోవడం మంచిది. అక్టోబర్ 29వ తేదీన ధన త్రయోదశి, 30వ తేదీన నరక చతుర్దశి, 31వ తేదీన లక్ష్మీ పూజ, నవంబర్ రెండవ తేదీన గోవర్ధన పూజ, నవంబర్ మూడో తేదీన భాయిదూచ్ జరుపుకోవాల్సి ఉంటుంది.
ఇది ఇలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దీపావళి పండుగను అక్టోబర్ 31న జరుపుకుంటారు. అయితే ప్రభుత్వం కూడా అక్టోబర్ 31వ తేదీన పండుగ సెలవును ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలలకు అక్టోబర్ 31వ తేదీన పండుగ సెలవు ప్రకటించారు. మన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులో దీపావళికి వరుసగా రెండు, నాలుగు రోజులు సెలవులు ప్రకటించారు.
తమిళనాడులో ప్రభుత్వం నవంబర్ 1వ తేదీని సెలవుగా ప్రకటించినప్పటికీ తిరిగి ఆ సెలవును భర్తీ చేయడానికి నవంబర్ 9వ తేదీన పని దినంగా ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నవంబర్ ఒకటో తేదీన సెలవు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
LATEST UPDATE :
-
Hyderabad : ఓఆర్ఆర్ టు కొండాపూర్.. విస్తరణ పనులు..!
-
Pds Rice : పీడిఎస్ బియ్యం భారీగా పట్టివేత.. క్రిమినల్ కేసు నమోదు..!
-
District collector : ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ వార్నింగ్..!
-
Miryalaguda : దోమకాటుకు పురుగు మందు చల్లితే.. ఉన్న పొలం ఎండిపోయింది, రైతు కుటుంబం ధర్నా..!
-
High Cholesterol : అధిక కొలెస్ట్రాల్ నిరోధించడానికి ఆహారంలో ఇవి తీసుకోండి.. గుండె సురక్షితం, జబ్బులు దూరం..!









