Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో రైతాంగం రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. గతంలో ఉన్న రైతుబంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చింది. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి రెండు విడుదలగా పదివేల రూపాయలను రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందజేసేవారు. కాగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి 12 వేల రూపాయలను రెండు విడుదలగా అందజేస్తామని ప్రకటించింది.
యాసంగి సీజన్ లో రైతులకు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు మూడు ఎకరాల లోపు పంట సాగు చేసిన రైతులకు రైతు భరోసా పథకాన్ని అందజేసింది. దాంతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేసింది. 2025 మార్చి 31వ తేదీలోగా రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం విధితమే. కానీ ఇప్పటివరకు రైతు భరోసా పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం వల్ల రైతు సంఘం ఆందోళనలో ఉన్నారు.
ప్రభుత్వం రైతు భరోసా పై ఎప్పుడు ప్రకటన చేస్తుందో అని ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సారి రైతుబంధు పథకం కొనసాగించి రైతులకు ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున వారి వారి ఖాతాలలో జమ చేసింది. కానీ ఆ తర్వాత 2024 వానాకాలం సీజన్ లో రైతు భరోసా అందజేయలేదు. 2025 యాసంగి సీజన్ లో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం సీజన్ పూర్తయ్యే వరకు కూడా పూర్తిస్థాయిలో రైతులకు రైతు భరోసా పథకాన్ని అందజేయలేదు. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పంట చేతికొచ్చే వరకు కూడా పంట పెట్టుబడి సహాయం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో రైతు భరోసా పథకాన్ని ఈ నెలాఖరులోగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. రైతు భరోసా పథకానికి నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. దాంతో రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణలో అధికారులు ఉన్నారు. ఈ నెలాఖరు లోగా పూర్తిస్థాయిలో రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
MOST READ :
-
Google : గూగుల్ లోగో @ 10 ఇయర్స్.. న్యూ లుక్, డిఫరెంట్ ఏంటి..!
-
Murder : మహిళ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి దారుణ హత్య..!
-
Nose: ముక్కులో నుంచి రక్తం వస్తోందా.. అయితే ఈ ముప్పు ఉన్నట్లే..!
-
Steet Food: రుచిగా ఉన్నాయని రోడ్డు పక్కన ఫుడ్ లాగిస్తున్నారా.. అయితే మీకు ఆ రోగాలు గ్యారంటీ..!
-
Gold Price : తగ్గినట్టే తగ్గి.. మళ్లీ యధావిధిగా గోల్డ్ రేట్..!









