KTR : అధికారంలోకి రాగానే.. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం..!
KTR : అధికారంలోకి రాగానే.. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం..!
హైదరాబాద్, మన సాక్షి :
రాబోయే నాలుగు సంవత్సరాలలో తెలంగాణలో తప్పకుండా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడుతున్నారో..? ఆయనకు తెలంగాణకు సంబంధమేంటో.? అర్థం కావట్లేదు అన్నారు.
రాహుల్ గాంధీ వద్ద మార్కులు కొట్టేయడానికి రాజీవ్ గాంధీ విగ్రహం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాని, జూబ్లీహిల్స్ లో మీ ఇంట్లో గానీ పెట్టుకోవాలని ఘాటుగా విమర్శించారు. తెలంగాణ సెక్రటేరియట్ ముందు ఏర్పాటు చేసే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే వెంటనే సకల మర్యాదలతో తొలగిస్తామన్నారు.
కాంగ్రెస్ వాళ్లు ఎక్కడ కోరుకుంటే అక్కడికి రాజీవ్ విగ్రహాన్ని తరలిస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ తల్లికి అవమానం జరిగితే ఊరుకునేది లేదని ఆయన పేర్కొన్నారు.
ALSO READ :
PDS RICE : అర్ధరాత్రి ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు.. 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత..!
Food poison : పండగపూట విషాదం.. ఫుడ్ పాయిజన్ తో అనాధ పాఠశాలలో నలుగురు విద్యార్థులు మృతి..!
Cm Revanth Reddy : బాహుబలి.. ప్రభాస్ ఫై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..!
Viral video : లంచం డబ్బులు పంచుకున్న ట్రాఫిక్ పోలీసులు.. సిసి టీవీ రికార్డు వైరల్..!
ఢిల్లీ బాస్ల మెప్పు కోసం తెలంగాణ తల్లిని, అస్థిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని అవమానిస్తే ఊరుకోం..
కాంగ్రెస్ ప్రభుత్వం డా. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ ఎదురుగా పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము తిరిగి అధికారంలోకి రాగానే సకల మర్యాదలతో ఖచ్చితంగా తొలగిస్తాం.
– బీఆర్ఎస్… pic.twitter.com/oNiMoTGip1
— BRS Party (@BRSparty) August 19, 2024









