Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడంటే.. మంత్రి తుమ్మల స్పష్టం.. బిగ్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడంటే.. మంత్రి తుమ్మల స్పష్టం.. బిగ్ అప్డేట్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కోసం రైతుల ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగు ఎకరాల లోపు పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే రైతు భరోసా పెట్టుబడి సహాయం అందజేశారు. మిగతా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. మార్చి 31వ తేదీ వరకు అందరి రైతులకు రైతు భరోసా అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం విదితమే.
ఇప్పటివరకు రైతు భరోసా రాకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా రైతు భరోసా అందరి రైతులకు ఇప్పటివరకు యాసంగి సీజన్ ఇవ్వలేకపోయారు. దాంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా పై స్పష్టం చేశారు.
నిజామాబాదులో నిర్వహించిన రైతు మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతు భరోసా పథకం ద్వారా పెండింగులో ఉన్న రైతులందరికీ త్వరలో అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మే రెండవ వారంలోగా రైతులందరికీ రైతు భరోసా ఇచ్చేందుకు అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు.
MOST READ :
-
TG News : ఆరు నెలలైనా సబ్జెక్ట్ లేదు.. వేదికపైనే ఆర్డిఓపై మంత్రి పొంగులేటి ఆగ్రహం..!
-
Gold Price : పసిడి పరుగు.. ఈరోజు తులం ఎంతో తెలుసా..!
-
Rythu Bharosa : రైతులకు తీపి కబురు.. రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : పెన్షన్ నో టెన్షన్.. పెన్షన్ దారులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!
-
WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!









