Nelakondapalli : డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తారా.. చావమంటారా.. పురుగుల మందు డబ్బాలతో హల్ చల్..!
Nelakondapalli : డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తారా.. చావమంటారా.. పురుగుల మందు డబ్బాలతో హల్ చల్..!
నేలకొండపల్లి, మన సాక్షి :
అర్హత లేని వారికి అందించి.. అర్హత ఉన్న వారికి ఇవ్వకుండా… గ్రామ సభ నిర్వహించకుండా డబుల్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఏకపక్షంగా చేశారని ఆరోపిస్తూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. పురుగు మందు డబ్బాలతో ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు.
గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనటంతో అధికారులు ఘటనా స్థలం కు సందర్శించి… ఆందోళనకారులతో చర్చించి… ఆందోళన విరమించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని ఆచార్లగూడెం లో పంపిణీ కి సిద్ధంగా ఉన్న 18 డబుల్ ఇళ్లు వద్ద ఉద్రికత్త, పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం డబుల్ ఇళ్ల ను సిద్ధం చేస్తుండుగా గ్రామస్తులు పనులు అడ్డుకున్నారు.
ఇళ్ల వద్ద గ్రామస్తులు కొంత మంది నిరసన వ్యక్తం చేశారు. ఇళ్ల వద్దకు అధికారులు రాకుండా ముళ్ల కంచె ను వేసి నిరసన వ్యకం చేశారు. లబ్దిదారులను గ్రామ సభ.నిర్వహించకుండానే కొంత మంది ఏకపక్షంగా ఎంపిక చేశారని ఆందోళన చేపట్టారు.
కొంత మంది మహిళలు పురుగు మందు డబ్బాలు పట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. ఎంపిక చేసిన వారిలో అనర్హలు ఉన్నారని… అర్హత కలిగిన వారికి మాత్రమే అందించాలని డిమాండ్ చేశారు.
అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న నేలకొండపల్లి తహశీల్దార్ జె. మాణిక్యరావు మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఆలస్యం మధుసూధన్రావు ఘటనా స్థలం కు చేరుకున్నారు.
ఆందోళనకారులతో చర్చించారు. ఇంకా అర్హత కలిగిన వారు ఉంటే జాబితా ను ఇవ్వాలని, ఈ విషయం ను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పటంతో లబ్ధిదారులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
MOST READ :









