Nalgonda : తాపీ మేస్త్రిగా తండ్రి.. టౌన్ ప్లానింగ్ అధికారిగా ఎంపికైన కొడుకు..!
Nalgonda : తాపీ మేస్త్రిగా తండ్రి.. టౌన్ ప్లానింగ్ అధికారిగా ఎంపికైన కొడుకు..!
నల్లగొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా, నల్గొండ మండలం శేషమ్మ గూడెం కు చెందిన బొల్లెద్దు గురునాథ్ ది అతి పేద కుటుంబం. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. తండ్రి సైదులు తాపీ మేస్త్రీ. తల్లి వ్యవసాయ కూలి. ఒక తమ్ముడు. రోజు పనికి వెళ్లి చెమటోడిస్తేనే కానీ పూట గడవని కుటుంభం వారిది. తినడానికి తిండి కూడా సరిగా లేని పరిస్థితుల్లో సైదులు బోలెద్దు గురునాథ్ ను కష్టపడి చదివించి ఒక పెద్ద అధికారిగా ఉద్యోగం సాధించేందుకు కారణమయ్యాడు.
కాకతీయ యూనివర్సిటీ లో బి టెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన గురునాధ్ ఎలాగైనా మంచి ఉద్యోగం సంపాదించి సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉండి తన తల్లిదండ్రుల కష్టాలను తీర్చాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం నల్గొండ జిల్లా పరిషత్ స్టడీ సెంటర్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే నిమిత్తం చేరాడు.
అనుకున్నట్లుగానే కష్టపడి చదివి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ అధికారిగా ఉద్యోగం సంపాదించాడు. తనలాంటి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారికి పేదరికం అడ్డు కాదని బోల్లెద్దు గురునాథ్ నిరూపించి తనలాంటి వారికి ఆదర్శంగా నిలిచాడు.
బోల్లెద్దు గురునాథ్ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ అధికారిగా ఎంపిక కావడం పట్ల శేషమ్మ గూడెం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనల్ని మనం నమ్ముకోవడం, గట్టి ప్రయత్నం చేయడం, నిరంతర శ్రమ లాంటి సూత్రాలు పాటిస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఉన్నత స్థానాన్ని పొందవచ్చు అని బోలెద్దు గురునాథ్ అంటున్నాడు.
తనకు టిపిబిఓ గా ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉందని , ఇందుకు తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని, వారి కష్టాన్ని చూసి చలించిపోయి తాను ఎలాగైనా ఉన్నత ఉద్యోగాన్ని సాధించాలని కష్టపడి చదివి ఈ ఉద్యోగాన్ని సాధించినట్లు చెప్పారు. తాను టిపిబీవో ఉద్యోగం వచ్చినప్పటికీ ఇంకా ఉన్నత ఉద్యోగాన్ని సాధించేందుకు కృషి చేస్తానంటున్నాడు గురునాథ తాను ఉద్యోగాన్ని పొందడానికి మరో కారణం జిల్లా పరిషత్ స్టడీ సెంటర్ అని గురునాథ్ అంటున్నాడు.
నల్గొండ జిల్లా పరిషత్తు స్టడీ సెంటర్ తెలంగాణలోనే మంచి స్టడీ సెంటర్ అని ,ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయని, పేద విద్యార్థులకు చదువుతోపాటు, మధ్యాహ్న భోజనం సైతం ఇస్తున్నారని, స్టడీ సెంటర్ ను పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి అనుగుణంగా తీర్చిదిద్దడంలో జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి కృషి మరువలేనిదని, అలాగే జిల్లా పరిషత్తు మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి స్టడీ సెంటర్ లో సౌకర్యాల కల్పనకు ఎంతో కృషి చేశారన్నారు.
తన లాంటి పేద విద్యార్థులకు తల్లిలా ఈ స్టడీ సెంటర్ నిలిచిందని, స్టడీ సెంటర్లో ఏలాంటి సౌకర్యాలకు లోటు లేదని అంతేకాక, ఇటీవల ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష 25 వేల రూపాయలతో స్టడీ సెంటర్ లో పోటీ పరీక్షలకు చదివే అభ్యర్థులకు అన్ని రకాల పుస్తకాలను ఏర్పాటు చేయించారని, నిరుపేద అభ్యర్థులు ఈ స్టడీ సెంటర్ ను ఉపయోగించుకోవాలని బోల్లెద్దు గురునాథ్ అంటున్నాడు.
MOST READ :
-
District collector : మహిళ సంఘాలకు గుడ్ న్యూస్.. సోలార్ ప్లాంట్ కొరకు ప్రభుత్వ భూమి.. పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
-
Gold Price : పసిడి ప్రియులకు షాక్. మళ్ళీ పెరిగిన ధర, అంత ధర ఉంటే కొంటారా..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై క్లారిటీ.. అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Bank Transaction : ఫోన్ పే, గూగుల్ పే ఉందని ఎక్కువ లావాదేవీలు చేస్తున్నారా.. లిమిట్ ఎంతో తెలుసుకోకుంటే కష్టమే..!









