Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : మహిళ సంఘాలకు గుడ్ న్యూస్.. సోలార్ ప్లాంట్ కొరకు ప్రభుత్వ భూమి.. పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

District collector : మహిళ సంఘాలకు గుడ్ న్యూస్.. సోలార్ ప్లాంట్ కొరకు ప్రభుత్వ భూమి.. పరిశీలించిన జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట మండలంలోని అప్పిరెడ్డిపల్లి శివారులో గల సర్వే నంబర్ 17 లోని ప్రభుత్వ భూమిని గురువారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ఆ సర్వే నెంబర్ లో మొత్తం ఎంత భూమి ఉందని ఆర్డిఓ రాంచందర్ నాయక్ ను అడిగారు.

గుట్ట ప్రాంతమైన సర్వే నంబర్17 లో మొత్తం 57.28 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని ఆర్డీవో తెలపగా, వాటిలో సోలార్ పవర్ ప్లాంట్ కు అనువైన దక్షిణభాగ 10 ఎకరాల భూమిని గుర్తించి నివేదిక తయారుచేయాలని కలెక్టర్ ఆర్డీవోను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ లను ఏర్పాటు చేసేందుకు అన్ని జిల్లాలలో అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ఈ నెల 8 న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లను ఆదేశించిన విషయం విధితమే.

అందులో భాగంగానే గురువారం జిల్లా కలెక్టర్ మండలంలోని అప్పిరెడ్డిపల్లి శివారులో గల 17 సర్వేనెంబర్ లోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. జిల్లా మొత్తంగా అన్ని మండలాల్లో దాదాపు 196 ఎకరాల ప్రభుత్వ స్థలాలలో మహిళ స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ లను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వాన్ని నిబంధనల మేరకు కలెక్టర్ గురువారం అప్పిరెడ్డిపల్లి శివారులోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం ఆర్డిఓ రామచందర్ నాయక్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు మండలంలోని బైరoకొండ, అమ్మిరెడ్డిపల్లి లో గల ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిటి రామకృష్ణ, సర్వేయర్, ఆర్ ఐ తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు