TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : యాసంగి రైతు భరోసా ఆ రైతులకే.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : యాసంగి రైతు భరోసా ఆ రైతులకే.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో యాసంగి సీజన్ లో వ్యవసాయ సాగు ప్రారంభమైంది. ఇటీవలనే వానాకాలం సీజన్ ముగియడంతో యాసంగి సీజన్ కు గాను రైతులు సిద్ధమవుతున్నారు. కాగా వానాకాలం మాదిరిగానే యాసంగి సీజన్ లో కూడా ముందస్తుగానే రైతు భరోసా నిధులు ప్రభుత్వం అందజేస్తుందని ఎదురుచూస్తున్నారు.

కానీ ప్రభుత్వం యాసంగి సీజన్ లో సాగు విస్తీర్ణం ఆధారంగానే రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. రైతులు సాగు చేసిన పంటలకే రైతు భరోసా అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

అందులో భాగంగానే యాసంగి సీజన్ కు సంబంధించి సాగు విస్తీర్ణాన్ని శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా లెక్కించిన తర్వాత రైతు భరోసా నిధులను అందజేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శాటిలైట్ చిత్రాల ద్వారా సాగు విస్తీర్ణాన్ని గుర్తించి అంచనా వేసే సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని వారిని ఆదేశించారు. రైతులకు శాటిలైట్ చిత్రాల ఆధారంగా రైతు భరోసా అందించే ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంతో యాసంగి సీజన్లో రైతు భరోసా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రైతులు వానాకాలం సీజన్లో తుఫాన్ వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. కనీసం పెట్టుబడులు సైతం రాని పరిస్థితి నెలకొన్నది. దాంతో యాసంగి సీజన్లో సాగు చేయడం కష్టంగా మారింది. ప్రభుత్వం అందించే రైతు భరోసా ద్వారా యాసంగి సాగు చేసే ఆలోచనలో ఉన్న రైతులకు రైతు భరోసా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది.

గత వానాకాలం సీజన్ లోనే శాటిలైట్ ఆధారంగానే రైతులకు రైతు భరోసా పథకాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ సాధ్యం కాలేదు. దాంతో యాసంగి సీజన్ నుంచి ఈ ప్రక్రియను చేపట్టే అవకాశాలు ఉన్నాయి. రైతు భరోసా నిధులు దుర్వినియోగం కాకుండా సాగుచేసిన రైతులకే అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

MOST READ : 

  1. CM Revanth : తెలుగులో భారత రాజ్యాంగ గ్రంథం.. ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..!

  2. Narayanpet : భగవద్గీత కంఠస్థంలో ఘనాపాటి.. రాష్ట్ర స్థాయికి ఎంపికైన చిన్నారి మోక్షిత..!

  3. TG News : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే..!

  4. Phone Calls : ట్రూ కాలర్ అవసరం లేదు.. మీకు వచ్చే కాల్స్ కు ఆధార్ లో ఉండే పేరు డిస్ ప్లే అవుతుంది..!

మరిన్ని వార్తలు