Breaking Newsతెలంగాణరాజకీయం
TG News : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే..!

TG News : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తేదీలు ఇవే..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 12,760 గ్రామాలకు, ఒక లక్ష 13,534 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు
ఈ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్లు ఎన్నికల కమిషనర్ రాణి కొముదిని వెల్లడించారు. డిసెంబర్ 11, 14, 17వ తేదీలలో రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు దశలవారీగా ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుందని, రెండు గంటల నుంచి కౌంటింగ్ ఉంటుందని చెప్పారు. ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లు వెల్లడించారు.
MOST READ :
-
TG News : పిసిసి చీఫ్ పర్యటనలో కాంగ్రెస్ వర్గ పోరు.. తోపులాటలు, ఘర్షణలు..!
-
Hyderabad : రేపు ఆయా ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం..!
-
Miryalaguda : పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మిర్యాలగూడ నియోజకవర్గం గ్రామాల వారీగా వివరాలు ఇవీ..!
-
Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!









