క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : చోరీకి గురైన 111 ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ..!

Suryapet : చోరీకి గురైన 111 ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ..!

సూర్యాపేట, మనసాక్షి :

ప్రస్తుతం మొబైల్ ఫోన్ అనేది నిత్యావసరమైనది, సైబర్ మోసాలు మొబైల్ కేంద్రంగా జరుగుతాయి, ఫోన్ వినియోగించడంలో జాగ్రత్తలు పాటించాలిని, మొబైల్ పోతే వెంటనే సి ఈ ఐ ఆర్ పోర్టల్ నంధు నమోదు చేసి ఫోన్ బ్లాక్ చేసుకోవాలని జిల్లా ఎస్పీ కే నరసింహ అన్నారు.

శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో గత కొన్ని రోజుల నుండి వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు 22 లక్షల రూపాయల విలువ గల 111 ఫోన్ల ను గుర్తించి రికవరీ చేసి జిల్లా ఎస్పీ నరసింహ,అధనపు ఎస్పీ నాగేశ్వరావు తో కలిసి సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు (భాదితులకు) అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యవసరమైనది, దీనిని కమ్యూనికేషన్ కోసం, ఆన్లైన్ విద్య కోసం వినియోగిస్తున్నాం, మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్, సోషల్ మీడియా అకౌంట్స్, వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటివి ఫోన్ లో నిక్షిప్తం చేసుకుంటున్నాము అన్నారు.

మొబైల్ చోరికి గురైనా, పోగొట్టుకున్నా అందులో ఉన్న సమాచారం పోతుంది నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మద్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారని . మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు.

సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై ది ఓ టి (డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ-కమ్యూనికేషన్) సి ఈ ఐ ఆర్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈపోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని చెప్పారు.. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే సి ఈ ఐ ఆర్ పోర్టల్ ( https://www.ceir.gov.in ) నందు నమోదు చేసుకోవాలని మొబైల్ ను బ్లాక్ చేసి, మీ సేవా ద్వారా ధరఖాస్తు సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు.

ప్రజలు, వినియోగదారులు ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ లను కొనుగోలు చేసినట్లైతే అట్టి షాప్ యజమాని నుండి రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ దొంగలు దొంగిలించిన ఫోన్ లను మొబైల్ షాప్ లలో అమ్ముతున్నారని, తక్కువ ధరకు వస్తుందని దొంగిలించబడిన ఫోన్ అని తెలియక కొనుగోలు చేసి అమాయక ప్రజలు మోసాలకు గురి అవుతున్నారని అన్నారు.

ఎవరైన దొంగిలించబడిన ఫోన్ అని తెలిసి కూడా కొనుగోలు చేసినట్లైతే అట్టి వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 2024, 2025 రెండు సంవత్సరాల కాలంలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 2238 ఫోన్లు పోయినట్లు పిర్యాధులు వచ్చాయని వీటిల్లో జిల్లా పోలీసు 1362 ఫోన్లును గుర్తించి సబంధిత మొబైల్ ఫోన్ల యజమనులకి అందించడం జరిగిందని, జిల్లాలో ఫోన్ల 61 % తో రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందన్నారు.

పోలీసు శాఖ కృత నిచ్చాయంతో పని చేసి పెద్దమొత్తంలో ఫోన్స్ రికవరీ చేసి ఇక్కడ భాదితులకు అందించడం జరిగినది అన్నారు. జిల్లాలో వివిధ రూపాల్లో వినియోగదారులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ను సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐ.టి కోర్ సిబ్బందిని, పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. పోయిన మొబైల్ ఫోన్లు మళ్లీ దొరకదనుకున్న బాధితులు జిల్లా పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంభందిత బాధితులు జిల్లా ఎస్పీ కి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం రావు, ఐటీ కోర్ ఆర్‌ఎస్‌ఐ రాజశేఖర్, ఐ‌టి కోర్ సిబ్బంది, మొబైల్ పోగొట్టుకున్న బాధితులు ఉన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : సన్న బియ్యంతో సహపంక్తి భోజనం..!

  2. District collector : మద్యం ప్రియులకు బాడ్ న్యూస్.. నేడు దుకాణాలు బంద్..!

  3. Inter Results : ఇంటర్ మీడియట్ ఫలితాలు ఎప్పుడంటే.. డేట్ ఫిక్స్..!

  4. Heart care : మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే… ఇవి తినండి..!

  5. TG News : తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్.. మరో నూతన కార్యక్రమం ప్రారంభం..!

మరిన్ని వార్తలు