Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

TG : ముగిసిన రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ.. రెండు స్థానాలకు ముగ్గురు నామినేషన్..!

తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుల నామినేషన్ ప్రక్రియ గురువారం ముగిసింది. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యులుగా అభిషేక్ మను సంఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.

TG : ముగిసిన రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ.. రెండు స్థానాలకు ముగ్గురు నామినేషన్..!

హైదరాబాద్, మనసాక్షి :

తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుల నామినేషన్ ప్రక్రియ గురువారం ముగిసింది. కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యులుగా అభిషేక్ మను సంఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యాలయంలోని ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి వారు నామినేషన్ పత్రాలను అందజేశారు. అభిషేక్ మను సంఘ్వీ మూడు సెట్లు, వేం నరేందర్ రెడ్డి 4 సెట్లు, మరో ఇండిపెండెంట్ అభ్యర్థి సాయి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.

ఇండిపెండెంట్ అభ్యర్థి 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకుండా నామినేషన్ వేయడంతో ఎన్నికల అధికారి దానిని తిరస్కరించే అవకాశం ఉంది. దాంతో అభిషేక్ మను సంఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కానున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, కే. కేశవ రావు, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పాల్గొన్నారు.

MOST READ 

మరిన్ని వార్తలు