Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
Amangal : 120 కిలోల నల్ల బెల్లం, 120 కిలోల పట్టిక పట్టివేత.. ఇద్దరి నిందితుల అరెస్టు..!

Amangal : 120 కిలోల నల్ల బెల్లం, 120 కిలోల పట్టిక పట్టివేత.. ఇద్దరి నిందితుల అరెస్టు..!
ఆమనగల్లు, మనసాక్షి :
సారాయి తయారి పదార్థాలను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు ఎక్సెజ్ సీఐ బద్యనాథ్ చౌహన్ హెచ్చరించారు. హైదరాబాద్ నుండి వివిధ గ్రామాలకు సారాయి తయారీకి వినియోగించు నల్ల బెల్లం పట్టిక ముడి పదార్థాలను అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం మేరకు ఎక్సెజ్ సీఐ బద్యనాథ్ చౌహన్ సిబ్బందితో కలిసి కడ్తాల్ టోల్లాజా వద్దకు రావడంతో వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో భాగంగా ఓ వాహనంలో 120 కిలోల నల్ల బెల్లం 120 కిలోల పట్టిక లభించాయని సీఐ బద్యనాథ్ చౌహన్ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న నిందితులు ప్రవీన్ బిచ్చలను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ముడి పదార్థాలను తరలిస్తున్న వారి నుండి 2 కరచరవాణి ఆటో రిక్షాను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సోద లో ఎస్ఐ అరుణ్, శంకర్ బాబు, శ్రీను, ఆమని పాల్గొన్నారు.
MOST READ :
-
Miryalaguda : వీరు మామూలోళ్లు కాదు.. మిర్యాలగూడలో గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్..!
-
Tasildar : తహసిల్దార్ సీరియస్ వార్నింగ్.. తరుగు, తాలు పేరుతో కటింగ్ చేయొద్దు..!
-
RDO : ఆర్డిఓ కీలక ఆదేశాలు.. ధాన్యం కొనుగోలు కేంద్రం ఆకస్మిక తనిఖీ..!
-
Nalgonda : నల్గొండ జిల్లాలో పత్తి మూటలతో రోడ్డెక్కిన పత్తి రైతులు..!









