Miryalaguda : ఆ విత్తనాలు వేస్తే రైతులకు 15 శాతం అధిక దిగుబడి..!
Miryalaguda : ఆ విత్తనాలు వేస్తే రైతులకు 15 శాతం అధిక దిగుబడి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
రైతులే నాణ్యమైన విత్తనాలు వేసి ఇతర రైతులకు పంపిణీ చేయాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మిర్యాలగూడ మండలం స్థానిక మిర్యాలగూడ రైతు వేదిక నందు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ( నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం) వారు పంపిణీ చేస్తున్న కేఎన్ఎం 1638 వరి విత్తనాలను మినికిట్ రూపంలో పంపిణి కార్యక్రమంలో 48 వరి విత్తనాలు ప్యాకెట్లు 24 పెసర ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలు పండించి తమ గ్రామాలలోనే రైతులకు తక్కువ ధరలకు విత్తనాలను ఇచ్చి గ్రామ గ్రామాలలో నాణ్యమైన విత్తనాలు రైతులే పంటలుగా వేసి మిగతా రైతులకు విత్తనాలుగా ఇవ్వాలన్నారు.
విత్తన నాణ్యత పెరిగి రైతులకు 10 నుంచి 15% దిగుబడి అధికంగా వస్తుందన్నారు. అందువల్ల నకిలీ విత్తనాలను అరికట్టవచ్చని సూచించారు. పంట రోగాల భారీ నుంచి తప్పించుకొని రైతులకు అధిక అధిక లాభాలు వస్తాయని సూచించారు. రైతులు వ్యవసాయ అధికారుల, శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటిస్తూ వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు వస్తాయన్నారు.
రసాయనిక ఎరువులు అధికంగా వాడడం వల్ల నేలలోని భూసారం తగ్గి పంటలు రోగాల బారిన పడతాయని కావున రైతు సోదరులు పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసి కలియాదున్నడం వల్ల నెలలోసారం పెరిగి అదిగదిగుబడులు పొందవచ్చని సూచించారు. తొలకరి వర్షాలు మొదలయ్యాయని జూన్ 12 తారీఖున ఏరువాక కార్యక్రమాన్ని గ్రామ గ్రామాలలో రైతు సోదరులు నిర్వహించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మండల వ్యవసాయ అధికారి, ఏడీఏ ఇంచార్జ్ సైదా నాయక్, ఏ ఈ ఓ లు షఫీ, రమేష్, గోపి, బిందు, అఫ్రిన్, రైతులు పోలగాలి వెంకటేష్, శంకర్ రెడ్డి, గుండు నరేందర్, ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ జిందా, సూర్య నాయక్, చెల్లా రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
MOST READ :
-
WhatsApp : వాట్సప్ యూజర్లే నేరగాళ్ల టార్గెట్.. అప్రమత్తం లేకుంటే మీ ఎకౌంటు ఖాళీ.. ఆ బ్యాంక్ సలహాలు..!
-
Sleep : పగటి పూట నిద్రపోతున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
-
Tea : టీ తో బిస్కెట్ కలిపి తింటున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే..!
-
Tea : టీ తో బిస్కెట్ కలిపి తింటున్నారా.. అయితే ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే..!
-
Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!









