Nalgonda : రూ.52 లక్షల విలువైన 207 కేజీల గంజాయి దగ్దం..!
Nalgonda : రూ.52 లక్షల విలువైన 207 కేజీల గంజాయి దగ్దం..!
నల్లగొండ, మన సాక్షీ :
మాదక ద్రవ్యాల నిర్ములనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణా పైన జిల్లా పోలీసుల ఉక్కుపాదం మోపడం తో పాటు అక్రమ గంజాయి నివారణ పైన నిరంతర నిఘా పెడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలలో 18 కేసులలో 207.056 కేజీల గంజాయి 118 గంజాయి చెట్లు 173 మత్తు టాబ్లెట్స్ సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్మానుషంగా జనావసానికి దూరంగా ఉన్నటువంటి నార్కట్ పల్లి మండలం గుమ్మల బావి పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లా యస్.పి, డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో నిర్వీర్యం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా యస్.పి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా చేయడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు అక్రమ గంజాయి సరఫరా చేయు వారి పైన ప్రత్యేక నిఘా పెడుతూ పట్టుబడి చేయడం జరిగింది.
జిల్లా పరిధిలో అక్రమ గంజాయి, డ్రగ్స్ రవాణా మరియు వినియోగం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నమని మత్తు పదార్థాల రవాణా మీద ఎన్నొ దాడులు నిర్వహిస్తూ, ఎంతో మందిని అరెస్టు చేసి జైలు పాలు చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
యువత డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండాలి
జిల్లాలో యువతలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాల పట్ల కళాశాలల్లో పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల జీవితం నాశనం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఎవరైనా అక్రమ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు అని, జిల్లా పోలీసులు నిరంతరం నిఘా ఉంటుంది అని అన్నారు. ఎవరైన గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే, టోల్ ఫ్రీ నంబర్ 8712670266 కి సమాచారం తెలపాలని కోరారు.
MOST READ :
-
Mushroom Coffee : మష్రూమ్ కాఫీ.. ఇది కేవలం ట్రెండ్ కాదు.. ఆరోగ్య రహస్యం..తెలుసుకోండి ఇలా..!
-
Cyber crime : ఆన్‌లైన్ మోసం.. రూ.2.80 లక్షలు పోగొట్టుకున్న గృహిణి..!
-
Nalgonda : దళిత మైనర్ బాలికపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి.. పోక్సో కేసు నమోదు..!
-
Nalgonda : 15న నల్లగొండకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాక.. ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!
-
LMD : కరీంనగర్ ఎల్ఎండి 2 గేట్ల ఎత్తివేత..!









