TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nagarjunasagar : సాగర్ జలాశయానికి 3.21 లక్షల క్యూసెక్కుల వరద.. 26 గేట్లు ఎత్తి నీటి విడుదల, పర్యాటకుల జాతర.. Latest Update

Nagarjunasagar : సాగర్ జలాశయానికి 3.21 లక్షల క్యూసెక్కుల వరద.. 26 గేట్లు ఎత్తి నీటి విడుదల, పర్యాటకుల జాతర.. Latest Update

నాగార్జునసాగర్, మన సాక్షి :

నాగార్జునసాగర్ రిజర్వాయర్ కు వరద వరద ఉదృక్తి కొనసాగుతుంది. శుక్రవారం శ్రీశైలం జలాశయం నుండి 3,21,951 క్యూసెక్కుల వరద ఉధృక్తి కొనసాగుతుండటంతో డ్యామ్ అధికారులు 26 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 18గేట్లను 5అడుగులు, 8గేట్లను 10అడుగుల మేర ఎత్తి 2,86,548 క్యూసెక్కుల నీటిని మొత్తం 26గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.

దీనితో నాగార్జునసాగర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 587.50 అడుగులవద్ద నీరు నిల్వవుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 305.8030 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 29,029 క్యూసెక్కుల నీటిని, కుడి కాలువ ద్వారా 8680 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాల్వద్వారా 8367 క్యూసెక్కుల నీటిని, ఎస్.ఎల్.బి.సి ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని,లోలేవల్ కెనాల్ ద్వారా నీటి విడుదల లేదు.రిజర్వాయర్ నుండి మొత్తం 2,78,380 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

పర్యాటకుల రద్దీ : 

నాగార్జునసాగర్ డ్యామ్ అందాలను లైవ్ లో చూసేందుకు 5వ రోజు పర్యాటకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.పోలీసుల ముందస్తు బందోబస్తును ఏర్పాటు చేయడం ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వచ్చిన వాహనాలను ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ చెపియడంతో పర్యాటకులు కాలినడకన జలవిద్యుత్ కేంద్రం వద్దకు వెళ్లి డ్యామ్ అందాలను తిలకిస్తున్నారు.

అదేవిధంగా లాంచీ స్టేషన్ వద్ద, కొత్త బ్రిడ్జి, పాత వంతెన, డ్యామ్ ఎంట్రన్స్ భాగంలో పర్యాటకుల సందడి వాతావరణం నెలకొంది. సాగర్ అందాలను తనివితీరా చూస్తూ తమ ఆనందాన్ని తోటి వారితో పంచుకుంటున్నారు. డ్యామ్ దిగువ భాగాన పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

ALSO READ : 

Viral : హాజరు వేయాలంటే ముద్దు ఇవ్వాలి.. తోటి ఉపాధ్యాయురాలికి ఉపాధ్యాయుడు వీడియో కాల్.. (Video)

Rythu Barosa : రైతు భరోసా వారికేనా.. ఆలస్యం అందుకేనా..!

Good News : ప్రభుత్వం గుడ్ న్యూస్.. మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత కుట్టు మిషన్ పథకం, దరఖాస్తు చేసుకోండి ఇలా..!

మరిన్ని వార్తలు