Srisailam : శ్రీశైలంకు మళ్లీ 3.92 లక్షల క్యూసెక్కుల వరద, 4.13 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో.. Latest Update
Srisailam : శ్రీశైలంకు మళ్లీ 3.92 లక్షల క్యూసెక్కుల వరద, 4.13 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో.. Latest Update
మన సాక్షి, వెబ్ డెస్క్ :
కృష్ణానది పరివాహక ప్రాంతంలో మళ్లీ వరద ఉధృతి పెరిగింది. పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుల నుంచి వరద నీరు దిగువకు చేరుతుంది. దాంతో శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్ళీ వరద ఉధృతి పెరిగింది. ఇటీవల కొంతమేర వరద తగ్గినప్పటికీ శుక్రవారం నుంచి మళ్లీ వరద ఉధృతి పెరిగింది. శ్రీశైలం జలాశయానికి 3, 92,415 క్యూసెక్కుల వరద చేరుతుంది. దాంతో 4.13 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ కు కూడా వరద ఉధృతి భారీగా పెరగడంతో 26 గేట్లు ఎత్తి దిగువకు 2.57 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 3,29,576 చేరుతుండగా 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
కృష్ణానది ఎగువన ఉన్న ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ఆలమట్టికి 2.06 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని నారాయణపూర్ కు వదులుతున్నారు. నారాయణపూర్ నుంచి 1.29 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. జూరాలకు బీమా నుంచి 1.22 లక్షల క్యూసెక్కులతో పాటు మొత్తం 2.96 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుంది.
ALSO READ :
Rythu Barosa : రైతు భరోసా వారికేనా.. ఆలస్యం అందుకేనా..!
Runamafi : రుణమాఫీ రైతులకు వడ్డీ భారం.. బ్యాంకర్ల మెలిక..!
భారీ గుడ్ న్యూస్ : ఫోన్ పే, గూగుల్ పే మీకు ఉందా..! ఉంటే తెలుసుకోవాల్సిందే









