TOP STORIESBreaking Newsతెలంగాణ

Srisailam : ఆల్మట్టికి 3లక్షల క్యూసెక్కులు.. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!

Srisailam : ఆల్మట్టికి 3లక్షల క్యూసెక్కులు.. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. ఇప్పటివరకు ఆల్మట్టి ప్రాజెక్టుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. ప్రస్తుతం వరద ప్రవాహం పెరిగి 3 లక్షల క్యూసెక్కులకు చేరింది. దాంతో ఆల్మట్టి డ్యాం నుంచి దిగువకు 3 లక్షల కేశక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

నారాయణపూర్ ప్రాజెక్టుకు 2,61, 397 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా 2, 65, 360 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదే విధంగా జూరాల ప్రాజెక్టుకు 2 లక్షల 49వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 2, 54,167 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు తుంగభద్ర నించి కూడా 98,360 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దాంతో శ్రీశైలం జలాశయానికి 2, 58, 069 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతో శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులకు గాను 861 అడుగులకు ప్రస్తుతం చేరింది.

నాగార్జునసాగర్ లో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం :

నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. ప్రాజెక్టులన్ని పూర్తిస్థాయిలో నిండడంతో దిగువకు నీరు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కాగా శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పాదన వల్ల 45,236 కేసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా నాగార్జునసాగర్ కు 52,199 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.

సాగర్ అవుట్ ఫ్లో 6282 క్యూసెక్కుల ఉంది. సాగర్ లో నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. సాగర్ జలాశ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులకు గాను ప్రస్తుతం 506.60 అడుగులకు చేరింది.

ఇవి కూడా చదవండి : 

Good News : నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి శుభవార్త.. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ..!

Telangana : ఉద్యోగుల ఖాతాల్లోకి నగదు.. శుభవార్త తెలియజేసిన తెలంగాణ ప్రభుత్వం..!

Srishailam : శ్రీశైలంలో 859 అడుగులకు చేరిన నీటిమట్టం.. కొనసాగుతున్న వరద.. LATEST UPDATE

SRISHAILAM : శ్రీశైలంకు కృష్ణ, తుంగభద్ర నుంచి భారీ వరద.. గంట గంటకు పెరుగుతున్న నీటిమట్టం, వారం రోజులు కొనసాగితే..!

మరిన్ని వార్తలు