Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయంహైదరాబాద్

Good News : నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి శుభవార్త.. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ..!

Good News : నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి శుభవార్త.. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్కముందే దాదాపు 60 వేల ఉద్యోగాల నియామకాలు జరపడం ద్వారా యువత పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ఫైర్ సర్వీసెస్ – సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ను ముఖ్యమంత్రి సమీక్షించి వారి గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం ప్రసంగించిన ముఖ్యమంత్రి, గతంలో 30 వేలు మంది నియామక పత్రాలు అందుకున్న వారిలో 483 ఫైర్‌మెన్‌లు, 155 డ్రైవర్‌ ఆపరేటర్స్‌కు కూడా ఉండటం, వారిప్పుడు కఠిన శిక్షణ కూడా పూర్తి చేసుకోవడంపట్ల ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు.

అధికారం చేపట్టిన 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలను అందించిన విషయాన్ని గుర్తుచేస్తూ, డీఎస్సీ, గ్రూప్ 1, 2, 3, లాంటి వివిధ శాఖల్లో ఖాళీలైన మరో 30 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగ యువకుల్లో విశ్వాసం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ముఖ్యమంత్రి వివరించారు.

ఏ ప్రమాదాలు జరిగినా ప్రాణాలకు తెగించి సామాజిక బాధ్యతగా ఉద్యోగంలో చేరడానికి ముందు కొచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని అభినందిస్తుందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, వారిచ్చే సూచనలు అమలు చేయడానికి, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపించాలన్నదే తమ ఆలోచనగా పేర్కొన్నారు.

సహేతుకమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఎవరూ నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ మల్లేశం, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ALSO READ : 

ఆగస్టులోనే పంచాయతీ ఎన్నికలు..?

BUDGET 2024 : తెలంగాణ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత..!

Srishailam : శ్రీశైలంలో 859 అడుగులకు చేరిన నీటిమట్టం.. కొనసాగుతున్న వరద.. LATEST UPDATE

రాష్ట్ర సరిహద్దుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా ఎస్పీ ఆదేశం

మరిన్ని వార్తలు