Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

BIG BREAKING : భద్రాద్రి జిల్లాలో వరదలో చిక్కుకున్న 30 మంది కూలీలు.. హెలికాప్టర్ సహాయంతో రక్షించిన ఎన్డిఆర్ఎస్ సిబ్బంది..!

BIG BREAKING : భద్రాద్రి జిల్లాలో వరదలో చిక్కుకున్న 30 మంది కూలీలు.. హెలికాప్టర్ సహాయంతో రక్షించిన ఎన్డిఆర్ఎస్ సిబ్బంది..!

మన సాక్షి , భద్రాద్రి కొత్తగూడెం :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరదలో 30 మంది కూలీలు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారాయణపురం లోని పెద్దవాగుకు భారీ వరదరావడంతో ఎలాంటి సమాచారం లేకుండా మూడు గేట్లు ఎత్తారు. దాంతో భారీగా నీరు దిగువకు విడుదలవుతుంది.

ఈ సందర్భంగా వ్యవసాయ కూలీలు 30 మంది వరదలో చిక్కుకున్నారు. అశ్వరావుపేట, నారాయణపురం వద్ద కూలీలు చిక్కుకున్నారు. వరదలో చిక్కుకున్న కూలీలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కూలీలు సమీపంలోని చెట్లెక్కి ప్రాణాలను రక్షించుకున్నారు.

బాధితులను రక్షించేందుకు సిఎం ఓతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. హెలికాప్టర్ సహాయంతో బాధితులను రక్షించాలని కోరారు. హెలికాప్టర్ సహాయంతో కూలీలను ఎన్డిఆర్ఎస్ సిబ్బంది రక్షించారు. హెలికాప్టర్ లో వారిని నెల్లూరుకు క్షేమంగా తీసుకెళ్లారు.

పెద్దవాగు ఉప్పొంగడంతో సమీప గ్రామాలలోకి వరద నీరు భారీగా చేరింది. ఆంధ్రప్రదేశ్లోని వేలేరుపాడు మండలంలో 10 గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదం పొంచి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి : 

BREAKING : పిడుగుపాటుతో అన్నదమ్ములు మృతి..!

కృష్ణమ్మ పరవళ్ళు.. తెరుచుకున్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లు.. త్వరలో శ్రీశైలం, సాగర్ కు వరద..!

మరిన్ని వార్తలు