TG News : 317 జీఓ అమలు నివేదిక సిద్ధం.. సీఎంకు అందజేసిన మంత్రి దామోదర్.. రాజనర్సింహా..!
TG News : 317 జీఓ అమలు నివేదిక సిద్ధం.. సీఎంకు అందజేసిన మంత్రి దామోదర్.. రాజనర్సింహా..!
అందోలు, మనసాక్షి :
రాష్ట్రంలోని కొత్తజోన్లు, కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఉద్దేశించిన 317 జీవో, ఉద్యోగాల భర్తీకి సంబందించిన 46 జీవో సమస్యలపై అద్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన సబ్‌కమిటీ ఉద్యోగ, ఉపాధ్యాయులు, నిష్ణాతులైన మేధావులతో అభిప్రాయాలను, సూచనలను సేకరించి పూర్తి నివేదికను తయారు చేసింది.
దీనికి సంబందించిన నివేదికను ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవెంత్‌రెడ్డికి హైద్రాబాద్‌లోని స్వగృహంలో కమిటీ చైర్మెన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సి.దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి అందజేశారు. 317 జీఓ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన సభ్యులు, మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లు పలు సంఘాల నాయకులు, మేధావులతో సమావేశమైన విషయం తెలిసిందే.ఉద్యోగుల, ఉపాధ్యాయుల అభిప్రాయాలను క్యాబినెట్ సబ్ కమిటీ వినతుల రూపంలో ప్రత్యక్షంగా, వెబ్సైట్ ద్వారా అప్లికేషన్స్ ను స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు,
వివిధ శాఖల ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి తుది నివేదిక పత్రాలను సీల్డ్ కవర్ లో ఉంచి ముఖ్యమంత్రికి అందజేశారు. త్వరితగతిన 317 జీఓ అమలుకు సంబంధించిన విషయాలపై నివేదికను అందజేసినందుకు మంత్రులను సీఎం అభినందించారు.
LATEST UPDATE :
-
Viral Video : నేను నిన్ను కొట్టను కానీ.. ఆ టీచర్ రహస్యం, అలా బయటపడింది.. (వీడియో)
-
District collector: మన ఇసుక – మన వాహనం ద్వారా ఇసుక రవాణా.. జిల్లా కలెక్టర్..!
-
Video : చీ చీ అంత దారుణమా.. పనిమనిషి వంట గదిలో.. (వీడియో)
-
Good News : మీకు ఐదు ఎకరాల లోపు ఉందా.. భారీ గుడ్ న్యూస్, కేంద్రం మరో కొత్త పథకం..!









