Drinking water : ఈ ప్రాంతంలోని 245 గ్రామాలు, 3 మున్సిపాలిటీలలో 36 గంటలు త్రాగునీరు బంద్..!

Drinking water : ఈ ప్రాంతంలోని 245 గ్రామాలు, 3 మున్సిపాలిటీలలో 36 గంటలు త్రాగునీరు బంద్..!
నారాయణపేట టౌన్, మన సాక్షి :
నారాయణపేట జిల్లా మన్యంకొండ నుండి నారాయణపేటకు పోయే మార్గంలో మరికల్ వద్ద మిషన్ భగీరథ పైపులైన్ పై రెండు చోట్ల లీకేజీలు ఏర్పడినాయని, లీకేజీ చెందిన పైపులను తీసి, కొత్త పైపులు అమర్చాల్సిన అవసరం ఉన్నందున నేడు శుక్రవారం రాత్రి 8 గంటల నుండి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు మొత్తం 36 గంటల పాటు నీటి సరఫరా తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు కార్యనిర్వాహక అభియంత మిషన్ భగీరథ గ్రిడ్ మహబూబ్ నగర్ డివిజన్ ఇంజనీర్ డి. శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
భగీరథ పైపులు మరమ్మత్తుల కారణంగాపనుల మన్యంకొండ నీటి శుద్ధి కేంద్రం నుండి నీటి సరఫరా అయ్యే ఈ క్రింద తెలిపిన ప్రాంతాలకు నేటి సరఫరా ఉండదన్నారు. పూర్తిగా ప్రభావిత మండలాలు: దేవరకద్ర, నర్వ, మరికల్, ఊట్కూర్,నారాయణపేట, దామరగిద్ద మండలాలలో, పాక్షికంగా ప్రభావిత మండలాలు: కౌకుంట్ల, చిన్నచింతకుంట, మక్తల్, దన్వాడ మండలాలకు నీటి సరఫరా ఉండదని తెలిపారు. మొత్తంగా 245 గ్రామాలు 3 మున్సిపాలిటీలు (నారాయణపేట, మక్తల్, దేవరకద్ర) నీట రఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. కావున ప్రజలందరూ సహకరించగలరని కోరారు.









