Srisailam : శ్రీశైలం నుంచి 10 గేట్లతో 4.36 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల, పర్యాటకుల సందడి, చంద్రబాబు జల హారతి..!
Srisailam : శ్రీశైలం నుంచి 10 గేట్లతో 4.36 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల, పర్యాటకుల సందడి, చంద్రబాబు జల హారతి..!
మన సాక్షి :
కృష్ణానది ఉగ్రరూపం దాలుస్తుంది. శ్రీశైలంకు వరద ప్రవాహం ఉదృతంగా కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిపోయింది. సోమవారం 3 గేట్లను తెరిచిన అధికారులు గురువారం నాటికి 10 గేట్లతో నిరంతరంగా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలంకు ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయి.
దాంతో భారీగా వరద నీరు చేరుతుందివ శ్రీశైలం జలశయానికి 3,95,162 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా గేట్ల ద్వారా, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 4,36,902 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం గేట్లు 12 ఉండగా 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేయడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టును చూసేందుకు భారీగా తరలివస్తున్నారు.
గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీశైలం జలాశయాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. ప్రాణకోటి జీవనాధారమైన జలాలను ఇచ్చే నదులను దేవతలుగా భావించే సాంప్రదాయం ప్రకారం జలాశయం వద్ద చంద్రబాబు నాయుడు జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇవి కూడా చదవండి :
Ration Cards : కొత్త రేషన్ కార్డులపై క్యాబినెట్ కీలక నిర్ణయం.. సబ్ కమిటీ ఏర్పాటు..!
Nagarjunasagar : నాగార్జునసాగర్ లో బాంబు స్క్వాడ్లు, జాగిలాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు..!
Telangana : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం..!
Cm Revanth Reddy: రైతులకు బిగ్ రిలీఫ్.. రూ.1350 కోట్లతో ఆ పథకం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన..!









