Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIEStravelజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

e – Garuda buses | ఎలక్ట్రిక్ గరుడ బస్సుల టైమింగ్స్.. ! ఎక్కడి నుంచి ఎక్కడికి ..?

e – Garuda buses | ఎలక్ట్రిక్ గరుడ బస్సుల టైమింగ్స్.. ! ఎక్కడి నుంచి ఎక్కడికి ..?

హైదరాబాద్ , మన సాక్షి :

అత్యాధునిక సౌకర్యాలతో పాటు కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ఏసి బస్సులను తెలంగాణ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం 10 ఎలక్ట్రిక్ నూతన బస్సులను ప్రారంభించారు.

 

ఎక్కువ ప్రయాణికులు ప్రయాణించే రూట్ హైదరాబాద్ – విజయవాడ మధ్యలో మొట్టమొదటిసారిగా వీటిని ప్రారంభించారు. ఈ రూట్ లో ప్రతిరోజు 50వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. వారి సౌకర్యార్థం ఎలక్ట్రిక్ గరుడ బస్సులను తెలంగాణ ఆర్టీసీ ప్రారంభించింది.

 

ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్, టీఎస్ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్, ఒలెక్ట్రా సీఎండీ ప్ర‌దీప్ తో క‌లిసి మియాపూర్ చౌరస్తాలో 10 కొత్త ఈ గరుడ బస్సులను ప్రారంభించ‌డం జ‌రిగింది. ఈ కొత్త బ‌స్సులు హైద‌రాబాద్- విజ‌య‌వాడ మార్గంలో న‌డుస్తాయి.

 

ప్ర‌తి రోజు హైదరాబాద్ లోని మియాపూర్ క్రాస్ రోడ్ నుంచి 06:30, 08:30, 10.30, 18:10, 19:50, 21:50 గంట‌ల‌కు ఎంబీజీఎస్ మీదుగా విజ‌య‌వాడ‌కు బ‌య‌లుదేరుతాయి.

 

తిరిగి విజ‌య‌వాడ నుంచి హైదరాబాదుకు బయలుదేరే సమయాలు. ఉద‌యం 06:20, 08:00,10:00, 18:40, 20:40, 22:40 గంట‌ల‌కు హైద‌రాబాద్ కు న‌డుస్తాయి.

మరిన్ని వార్తలు