Train journey : రైలు ప్రయాణికులు.. ఇది అస్సలు మర్చిపోకండి..!
Train journey : రైలు ప్రయాణికులు.. ఇది అస్సలు మర్చిపోకండి..!
మనసాక్షి , వెబ్ డెస్క్ :
ఇటీవల ఒడిశాలో రైలు ప్రమాద దుర్ఘటన చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో చాలామంది మృతి చెందగా ఎంతోమంది క్షతగాత్రులైన విషయం కూడా తెలిసిందే. సుమారు 280 మందికి పైగా చనిపోయినట్లు సమాచారం.
కాగా రైలులో ప్రయాణించేటప్పుడు ఇన్సూరెన్స్ చేసుకోవాలని చెబుతున్నారు. అయితే రైలు ప్రయాణికులు ఇన్సూరెన్స్ ఎలా చేసుకోవాలో..? తెలుసుకుందాం..! ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఏంటి..? అనే విషయం కూడా ప్రయాణికులు తెలుసుకోవాల్సి ఉంది.
Also Read : App : మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే వెంటనే రిమూవ్ చేయండి.. లేదంటే మీ డేటా చోరీ అవుద్ది..!
రైలు ప్రయాణికులు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదేంటంటే ఎవరైనా రైలు ప్రయాణం చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. రైలు ప్రయాణం కోసం ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీని వల్ల కేవలం 35 పైసలకే 10 లక్షల రూపాయల బీమా ఉంది.
ఈ ఆప్షన్ ను కచ్చితంగా క్లిక్ చేయాలి. రైలు ప్రయాణంలో ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ బీమా డబ్బు మీ కుటుంబానికి అండగా నిలుస్తుంది.









