Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా

Crime News : దొంగతనాలకు పాల్పడుతున్న ట్రాన్స్ జెండర్స్.. చాకచక్యంగా పట్టుకున్న చౌటుప్పల్ పోలీసులు..!

Crime News : దొంగతనాలకు పాల్పడుతున్న ట్రాన్స్ జెండర్స్.. చాకచక్యంగా పట్టుకున్న చౌటుప్పల్ పోలీసులు..!

ఐదుగురు ట్రాన్స్ జెండర్స్, ఇద్దరు పురుషులు అరెస్ట్

తులంన్నర బంగారం గొలుసు,ఆరు చరవాణిలు, ఒక కారు స్వాధీనం..

వివరాలు వెల్లడించిన ఏసీపీ వై.మొగిలయ్య

చౌటుప్పల్, మన సాక్షి :

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులు దండు మల్కాపురం ఎక్స్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు ట్రాన్స్ జెండర్స్ లను గుర్తించి మంగళవారం ఉదయం సుమారు 6:30 గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు. వీరితో పాటు వారికి సహకరిస్తున్న ఇద్దరు పురుషులను కూడా అరెస్టు చేసినట్లు చౌటుప్పల్ ఏసిపి మొగిలయ్య తెలిపారు.

వీరి వద్ద నుండి తులం న్నర బంగారం గొలుసు, ఒక్క కారు, 6 చరవాణిలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. చౌటుప్పల్ ఏసీపీ మొగిలయ్య మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. మందాల శ్రావణి ,డి రజిత, నడిపుడి మాళవిక, కందపల్లి స్వర్ణ, కర్రి పద్మ అను ట్రాన్స్ జెండర్స్ అలాగే వీరితోపాటు పాశ్వాన్ సాగర్, సానబోయిన దినేష్ అనే ఇద్దరు పురుషులు జాతరలలో డాన్స్ ఈవెంట్స్ చేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు.

 

వీరికి వాటిలో వచ్చిన డబ్బులను ఇష్టం వచ్చినట్లు వాడుకుంటూ, చెడు వ్యసనాలకు అలవాటు పడి వారి అవసరాలకు డబ్బులు సరిపోక దొంగతనాలు చేయడం మొదలుపెట్టినారని తెలిపారు.

ALSO READ : 

  1. గంజాయి రాకెట్ ముఠాల గుట్టు రట్టు
  2. సూర్యాపేట : ఘోర రోడ్డు ప్రమాదం.. ఉపాధ్యాయురాలు మృతి, ఆమె భర్త కు తీవ్ర గాయాలు..!
  3. Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
  4. Degree : డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సు తప్పనిసరి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..!
  5. మిర్యాలగూడ : మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. తప్పిన ప్రమాదం..!

అదే మాదిరిగా ఈనెల 11న రాజమండ్రి నుండి బయలుదేరి రాబోయే వినాయక చవితి పండుగకు ఈవెంట్స్ చేయుటకు గాను పాశ్వాన్ సాగర్ అనే వ్యక్తి కారులో బయలుదేరి చౌటుప్పల్ శివారులోని నేషనల్ హైవే 65 పైన హెచ్ 9 హోటల్ సమీపంలో బైక్ పై వెళుతున్న ఊదరి రమేష్ అను వ్యక్తికి అడ్డు తగిలి ఆపి అతని వద్ద నుండి సుమారు తులంన్నర బంగారపు గొలుసును దొంగలించుకొని పారిపోయారని పోలీసులు వెల్లడించారు.

గతంలో కూడా వీరు అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద, ఘట్ కేసర్ ప్రాంతాలలో కూడా దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు ట్రాన్స్ జెండర్స్ ను, కారు డ్రైవర్లను ఇద్దరిని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు ఏసిపి మొగిలయ్య వెల్లడించారు.

దొంగతనం జరిగిన మరుసటి రోజునే చాకచక్యంగా నిందితులను పట్టుకున్న పోలీసులను ఏసిపి మొగిలయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ రూరల్ సీఐ ఎం మహేష్, ఎస్సై యాదగిరి, ఎస్సై ధనుంజయ, కానిస్టేబుళ్లు పగిడి శ్రీను, శోభన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు