కేటీఆర్ ఫోన్ కాల్ లీక్.. సోషల్ మీడియాలో షేర్ చేసిన కాంగ్రెస్..! (ఆడియో)
కేటీఆర్ ఫోన్ కాల్ లీక్.. సోషల్ మీడియాలో షేర్ చేసిన కాంగ్రెస్..! (ఆడియో)
హైదరాబాద్, మన సాక్షి :
ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ పార్టీలలో వేడి పుడుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడంతో పాటు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు.
కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఫోన్ కాల్ లీక్ అయింది దానిని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సిరిసిల్ల తన సొంత నియోజకవర్గంలో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి వారానికి రెండు రోజులు అక్కడే ఉండి సమస్యలు పరిష్కరిస్తానని, ప్రతి కార్యకర్త తానే అభ్యర్థిగా అన్నట్టు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని ఫోన్లో కేటీఆర్ మాట్లాడారు.
ALSO READ : పారిపోయాడంటూ గజ్వేల్ సభలో సీఎం కేసీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!
అదేవిధంగా మెజారిటీ తగ్గుతుందని మనలో మనం మాట్లాడుకోవద్దని పేర్కొన్నారు. రాష్ట్ర మొత్తం సిరిసిల్ల వైపే చూస్తుందని పేర్కొన్నారు. ఆయన ఆడియో కాల్ లీక్ కావడంతో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో దానిని వైరల్ చేస్తుంది. ఫోన్ చేసి బతిలాడుకునే పరిస్థితి వచ్చిందంటూ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేటీఆర్ ఆడియో కాల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
మీరు కూడా వినండి :
కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే ప్రచారానికి పోవాలంటే వెనకాడుతున్న కేడర్. ఫోన్లు చేసి బ్రతిమాలాడుకునే పరిస్థితికి వచ్చింది బీఆర్ఎస్ పరిస్థితి.#ByeByeKCR pic.twitter.com/PXOvRujqt4
— Telangana Congress (@INCTelangana) November 22, 2023









