పారిపోయాడంటూ గజ్వేల్ సభలో సీఎం కేసీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గజ్వేల్ లో నిర్వహించిన సభకు కార్యకర్తలుగా భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పారిపోయాడంటూ గజ్వేల్ సభలో సీఎం కేసీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!

గజ్వేల్, మన సాక్షి

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గజ్వేల్ లో నిర్వహించిన సభకు కార్యకర్తలుగా భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ కామారెడ్డికి పారిపోయాడన్నారు.

కామారెడ్డి కాదు.. కన్యాకుమారికి పారిపోయినా నిన్ను ప్రజలు ఓడించి తీరుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ALSO READ : మిర్యాలగూడ : గులాబీమయం.. కాంగ్రెస్ సన్నాసులంటూ రెచ్చిపోయిన కేటీఆర్..!

మిమ్మల్ని చూస్తోంటే ఈసారి ఖచ్చితంగా గజ్వేల్ గడ్డపై జెండా ఎగరబోతుందన్న నమ్మకం కలుగుతోంది. రెండుసార్లు కేసీఆర్ ను ఎమ్మెల్యేను చేస్తే… మల్లన్న సాగర్ లో మిమ్మల్ని నిండా ముంచిండు.
కొండపోచమ్మలో మిమ్మల్ని తోసిండు, రంగనాయక్ సాగర్ లో ముంచిండు.

రైతుల వడ్లు కొనని కేసీఆర్… ఆయన ఫామ్ హౌస్ లో పండిన వడ్లను కావేరి సీడ్స్ కు క్వింటా రూ.4500లకు అమ్ముకుండు.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏమైనా బంగారం పండుతుందా?

ALSO READ : మిర్యాలగూడ : సిపిఎం, టిఆర్ఎస్ కు భారీ షాక్.. కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్లు , మాజీ కౌన్సిలర్లు..!

కేసీఆర్ ను మీరు పాతాళానికి తొక్కాలనుకుంటే.. కామారెడ్డికి పారిపోయిండు. కామారెడ్డికే కాదు.. కన్యాకుమారికి పారిపోయిన ప్రజలు నిన్ను ఓడించి తీరతారు.