మిర్యాలగూడ : సిపిఎం, టిఆర్ఎస్ కు భారీ షాక్.. కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్లు , మాజీ కౌన్సిలర్లు..!

మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. అధికార బీఆర్ఎస్ కు, సిపిఎం కు షాక్ ఇచ్చింది.

మిర్యాలగూడ : సిపిఎం, టిఆర్ఎస్ కు భారీ షాక్.. కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్లు , మాజీ కౌన్సిలర్లు..!

మిర్యాలగూడ , మన సాక్షి

మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. అధికార బీఆర్ఎస్ కు, సిపిఎం కు షాక్ ఇచ్చింది.

ఆయా పార్టీల నుంచి కౌన్సిలర్లు , మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి , సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుందూరు జానారెడ్డి, ఆయన కుమారుడు పీసీసీ కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు .

పార్టీలో చేరిన వారికి జానారెడ్డి మూడు రంగుల కండవా కప్పి స్వాగతం పలికారు. మిర్యాలగూడ పట్టణంలో సిపిఎం నుంచి గెలుపొందిన ఒకే ఒక్క కౌన్సిలర్ 10 వ వార్డుకు చెందిన అబ్దుల్ ఘని కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ALSO READ : కెసిఆర్ కుటుంబ పాలన  అంతం అందించడమే  లక్ష్యం..!

అదేవిధంగా మాజీ కౌన్సిలర్లు ఆలగడప గిరిధర్ యాదగిరి తదితరులు పార్టీలో చేరారు . ఈ సందర్భంగా కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భత్తుల లక్ష్మారెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని పేర్కొన్నారు.

ALSO READ : యువతకు ఉద్యోగాలు సృష్టించాలనేదే నా ముందున్న సవాల్.. మంత్రి జగదీష్ రెడ్డి..!

కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు చిలుకూరి బాలు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.