Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంవిద్యసూర్యాపేట జిల్లా

యువతకు ఉద్యోగాలు సృష్టించాలనేదే నా ముందున్న సవాల్.. మంత్రి జగదీష్ రెడ్డి..!

యువతకు ఉద్యోగాలు సృష్టించాలనేదే నా ముందున్న సవాల్.. మంత్రి జగదీష్ రెడ్డి..!

యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట , మనసాక్షి :

సూర్యాపేట యువతకు ఉద్యోగాలు సృష్టించాలనేదే నా ముందున్న సవాల్ అని మంత్రి, బిఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కోన్నారు. సూర్యాపేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పట్టణానికి చెందిన యువకులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ అందమైన, సుందర పట్టణంగా సూర్యాపేట ను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. సూర్యాపేట లో శాంతి భద్రతల విషయంలో రాజీలేదన్నారు. గత పాలనలో భీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి చెప్పే బాధ్యతను యువత దే అన్నారు.

ALSO READ : డబుల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి

రెండు ట్యాంక్ బండ్లు ఉన్న ఏకైక పట్టణం రాష్ట్రంలో సూర్యాపేట నే అన్న మంత్రి మరోసారి ఆశీర్వదిస్తే,
నెక్లెస్ రోడ్డుని తలపించేలా మూడవ టాంక్ బండ్ గా నల్లచెరువును మారుస్తానని అన్నారు. అభివృద్ధిని అడ్డు కో వడానికి కోర్టు కేసుల పేరుతో నిరోధకులు అడ్డుపడినారాన్న మంత్రి ,ఎన్ని అవాంతరాలు సృష్టించినా అభివృద్ధి లక్ష్యంముందు అవి నిలబడలేదని అన్నారు.

సూర్యాపేట అభివృద్ధి విషయం లో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టే బాధ్యత ను యువత నే తీసుకోవాలన్నారు. కారు గుర్తును గెలిపించుకుని భవిష్యత్తును నిర్మించుకుందాం అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి పట్టణం నలవైపుల నుండి తరలివచ్చిన యువత కు మంత్రి ఉపన్యాసం సరికొత్త జోష్ నింపింది అన్నారు.

ALSO READ : మహిళలకు, రైతులకు భారీ గుడ్ న్యూస్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంచలన హామీలు..!

సాయికుమార్, కాసం మని, అజయ్ ,వసంత్ ఆధ్వర్యంలో యువ సమ్మేళనం జరగగా రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మారుపెద్ది శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ రామ్మూర్తి యాదవ్, బత్తుల జానీ, లు సమ్మేళనం లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు