మహిళలకు, రైతులకు భారీ గుడ్ న్యూస్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంచలన హామీలు..!

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో శుక్రవారం విడుదల చేసింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గాంధీభవన్ లో విడుదల చేశారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తో కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు.

మహిళలకు, రైతులకు భారీ గుడ్ న్యూస్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంచలన హామీలు..!

హైదరాబాద్ , మన సాక్షి :

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో శుక్రవారం విడుదల చేసింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గాంధీభవన్ లో విడుదల చేశారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తో కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు.

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మహిళలకు , రైతులకు భారీ గుడ్ న్యూస్ తెలియజేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలు ఇవ్వగా వాటితో పాటు మేనిఫెస్టోలో 66 హామీలను ఇస్తూ అభయ హస్తం పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు.

ALSO READ : మిర్యాలగూడ : బీఆర్ఎస్ కు భారీ షాక్.. మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ లో చేరిక..!

ముఖ్యంగా ఇందిరమ్మ కానుక పేరుతో యువతులకు వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు పది గ్రాముల బంగారం ఇవ్వన్నట్లు పేర్కొన్నారు. తొలి, మలి విడత తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు ప్రతినెల 25వేల రూపాయలు చొప్పున గౌరవ పింఛన్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

ఉద్యమకారులపై కేసులు అన్నింటిని ఎత్తివేయడంతో పాటు 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని, 3 లక్షల రూపాయల వరకు వడ్డీ లేకుండా పంటలు ఉండాలని అందించనున్నట్లు తెలిపారు.

ALSO READ : మిర్యాలగూడ : బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావు అనుచరుల ఇళ్లలో ఐటి సోదాలు.. ఏకకాలంలో 40 బృందాలతో సోదాలు..!

ప్రతిరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు అందించనున్నట్లు తెలిపారు.

పూర్తిస్థాయి మేనిఫెస్టో ఇది :